- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tina Dabi : సివిల్స్ టాపర్ టీనా దాబీ ముందే ఇంగ్లీష్‌లో స్పీచ్ అదరగొట్టిన మహిళా సర్పంచ్.. వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: ఒక కార్యక్రమంలో ఓ మహిళా సర్పంచ్ ఇంగ్లీష్ స్పీచ్ అదరగొట్టింది. ఆమె అనర్గళమైన ప్రసంగం విని కలెక్టర్‌తో పాటు అందరూ అశ్చర్యపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మహిళా సర్పంచ్ చక్కటి ఆంగ్ల భాషా నైపుణ్యంతో ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ దృష్టిని ఆకర్షించింది. జలియాపా గ్రామ మహిళా సర్పంచ్ సోను కన్వర్ రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి వేదికపై నిలబడి ఆంగ్లంలో మాట్లాడారు.
‘ముందుగా మా కలెక్టర్ టీనా మేడమ్‌కి స్వాగతం పలుకుతాను. ఒక మహిళగా టీనా మేడమ్‌ని స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను’ అని ప్రసంగం స్టార్ట్ చేశారు. నీటి సంరక్షణపై ఆమె చాలా చక్కగా మాట్లాడారు. ఆమె ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి కలెక్టర్ చిరునవ్వు నవ్వి.. చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయింది.. అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
కాగా, ఐఏఎస్ అధికారిని టీనా దాబీ జైపూర్‌లో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే బార్మర్‌కు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. 2015లో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షలో తన మొదటి ప్రయత్నంలోనే టీనా దాబీ టాపర్‌గా నిలిచారు.