వెరైటీ వెడ్డింగ్ కార్డు.. పాతితే మొక్కలొస్తాయి..!!

by Anjali |   ( Updated:2024-03-15 13:31:45.0  )
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. పాతితే మొక్కలొస్తాయి..!!
X

దిశ, ఫీచర్స్: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ఘట్టం. మన జీవితంలోకి ఓ శాశ్వత బంధానికి స్వాగతం పలికే అద్భుత కార్యం. హిందూ సాంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన ఈ పవిత్ర కార్యాన్ని బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు.

అయితే బంధువులను పెళ్లికి ఆహ్వానించేందుకు.. పెళ్లి కార్డు అనేది తప్పనిసరి. మేళతాళాల మధ్య చుట్టాల ఇంటింటికి తిరుగుతూ నుదిటన బొట్టు పెట్టీ మరీ, పెండ్లి పత్తికలు అందజేస్తుంటారు. ఇంట్లో ఎవరూ లేకపోతే గుమ్మానికి బొట్టుపెట్టి వెడ్డింగ్ కార్డు తలుపులకు కట్టి వస్తారు.

కొంతమంది వెడ్డింగ్ కార్డు స్తోమతను బట్టి ప్రింట్ చేయిస్తారు. మరికొంతమంది బాగా గ్రాండ్ గా ముద్రిస్తారు. అయితే ఇప్పుడు మనం వినే పెళ్లి కార్డు పూర్తిగా భిన్నమైనది. కొంతమంది తమ వెడ్డింగ్ ఇన్విటేషన్ విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. వాటికి పర్సనల్ టచ్ యాడ్ చేయాలని డిఫరెంట్ గా థింక్ చేస్తారు.

తాజాగా తెలంగాణలో ఆదిలాబాదుకు చెందిన స్వర్ణలత అనే స్కూల్ ప్రిన్సిపాల్ తన కుమార్తె పెళ్లికి ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించారు. వివిధ మొక్కల విత్తనాలను వెడ్డింగ్ కార్డులో చేర్చాడు. తులసి, చామంతి, బంతి పువ్వు విత్తనాలు.. అలాగే కొత్తిమీర, పాలకూర, వంకాయ, టమాటా, ముల్లంగి వంటి కూరగాయల విత్తనాలను కూడా ఉంచారు.

ఈ వెడ్డింగ్ కార్డును వాటర్ లో నానబెట్టి.. ఆపై మట్టిలో నాటడం ద్వారా విత్తనాలు మొలకెత్తుతాయి. మొక్కలు పుట్టుకొస్తాయి. దీనిపై ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ‘కొత్త ప్రారంభానికి ప్రతీకగా మా కుమార్తె పెళ్లి ద్వారా మొక్కలకు జీవం పోయాలి. అందుకే ఈ పర్యావరణ అనుకూల ఆహ్వానాలను రూపొందించాం.

ఈ ఆలోచనాత్మక చర్య పెళ్లికి ఒక ప్రత్యేకమైన అంశాన్ని యాడ్ చేయడమే కాకుండా బంధువులలో పర్యావరణ స్పృహను కూడా ప్రోత్సహిస్తుంది. పచ్చని గ్రహానికి దోహదపడే వారి వేడుకల్లో కూడా ఇలాంటి పర్యావరణ అనుకూల ఆలోచనలను చేర్చుకోవడానికి ఈ పెళ్లి కార్డు ప్రేరణగా ఉపయోగపడుతుంది’. అంటూ ప్రిన్సిపాల్ స్వర్ణలత చెప్పుకొచ్చారు.

Read More..

బెస్ట్ ఫ్రెండ్స్‌తో ఈ విషయాలు పంచుకుంటున్నారా? బీ కేర్ ఫుల్..!!

Advertisement

Next Story