67 ఏళ్ల వయసులో రోప్ సైక్లింగ్ చేసిన బామ్మ.. వీడియో వైరల్

by Javid Pasha |   ( Updated:2023-08-18 15:46:37.0  )
67 ఏళ్ల వయసులో రోప్ సైక్లింగ్ చేసిన బామ్మ.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: వయసైపోతోంది.. తాము ఇంకేం చేయలేమంటూ తెగ బాధపడుతుంటారు కొందరు. కానీ ఈ బామ్మ స్టోరీ తెలిస్తే మాత్రం వారు కచ్చితంగా ఇన్ స్పైర్ అవుతారు. వయసు అనేది ఒక నెంబర్ మాత్రమేనని, తమ పనికి వయసు ఏమాత్రం అడ్డుకాదని తెలుసుకుంటారు. ఇక ఇంతకు ఈ బామ్మ ఏం చేసిందంటే.. తమిళనాడుకు చెందిన ఓ 67 ఏళ్ల బామ్మకు రోప్ సైక్లింగ్ చేయాలనేది చిరకాల వాంఛ. అయితే ఈ విషయం తన కొడుకుకు చెబితే ''రోప్ సైక్లింగ్ అంటే చాలా ప్రమాదంతో కూడింది.. ఈ వయసులో అలాంటి రిస్క్ ఎందుకమ్మా'' అంటూ నిరాకరించాడు. కానీ ఆ బామ్మ మాత్రం ఎలాగైనా రోప్ సైక్లింగ్ చేయాలనుకుంది.

ఈ క్రమంలోనే తలకు హెల్మెట్ పెట్టి, సేఫ్టీ బెల్ట్ ధరించి.. చాలా ఎత్తులో కట్టిన ఓ చిన్న తాడుపై నుంచి విజయవంతంగా సైకిల్ నడిపింది. ఇంత ప్రమాదకరమైన ఈ ఫీట్ ను ఏమాత్రం భయపడకుండా ఓ స్పోర్ట్స్ పర్సన్ లా అవలీలగా చేసిందీ బామ్మ. ఈ ఫీట్ ను యాత్రికన్ అనే వ్యక్తి ఇన్ స్టా లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వయసు అనేది ఓ నంబర్ మాత్రమేనని ఈ బామ్మ నిరూపించింది.. పట్టు వదలని విక్రమార్కురాలిలా తన చిరకాల వాంఛను నెరవేర్చుకుంది అంటూ బామ్మను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

Next Story