- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొసలి నోట్లో మనిషి.. ఆర్మూర్‌లో ఘటన అంటూ వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఇటీవల కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు మూడు ఊర్లు మునిగిపోయాయి. రాష్ట్రంలో వరదల కారణంగా పదుల సంఖ్యలో మరణించారు. ఎంతో మంది వరదలో కొట్టుకపోయి గల్లంతు అయ్యారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత జిల్లాల్లోని కాలువల్లో, చెరువు నీళ్లలో మోసళ్ళు తిరుగుతున్నట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వస్తున్న వీడియో తెలంగాణ ప్రాంతానివా..? లేక ఇతర ప్రాంతానికి సంబంధించినవా..? అనేది తెలియరావడం లేదు. ఈ క్రమంలోనే ఆర్మూర్ జిల్లాల్లోని ఓ చెరువులో మొసలి నోట్లో ఒక మనిషి చిక్కుకొని ఉన్న వీడియో చక్కర్లు కొడుతోంది.
ఆ మొసలి నోటితో ఒక వ్యక్తి కాలును పట్టుకోని ఈదుకుంటూ వెళుతున్నట్లు కనబడుతుంది. ఆ వ్యక్తి మాత్రం జీవించి లేనట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియో ఒక వ్యక్తి రికార్డ్ చేస్తుంటాడు. ఇది ఆర్మూర్ సంబంధించిన వీడియోనా? లేక ఇతర వేరే దేశంలోనిదా..? అనేది ప్రశ్నగా మిగిలింది. దీనిపై ప్రభుత్వం స్పందించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పాములు కూడా ఇళ్లల్లోకి వస్తన్నాయి. మరోవైపు అడవిలో నుంచి జింకలు గుంపులుగా వచ్చిన ఘటన ఇటీవల సంగారెడ్డి ప్రాంతంలో చూశాం.
ఇది అర్ముర్ లో జరిగింది అని చెప్తున్నారు @FactCheck_TS ఆర్మూర్ పట్టణంలోని.... చెరువులో 🐊 మొసలి నోట్లో మనిషి....పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది* pic.twitter.com/OMxRW2tuZr
— Name's Vikram (@VikramChityala2) July 31, 2023