సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న లగ్న పత్రిక.. తాటిచెట్లతో..!

by Anjali |
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న లగ్న పత్రిక.. తాటిచెట్లతో..!
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. యువత పెళ్లిళ్ల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడటం లేదు. బ్యాచిలర్ పార్టీ అని, ఫ్రీ వెడ్డింగ్ షూట్లని ఇలా ప్రతిదీ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లి ఆహ్వానాలు కూడా పూర్తిగా డిజిటర్‌గా మారిపోయాయి. ప్రజలు సాంకేతికతను ఉపయోగించి బంధువులను ఆహ్వానిస్తున్నారు. వివాహానికి సంబంధించిన ప్రతి వేడుకను చాలా క్రియేటివ్‌గా ఉండాలని భావిస్తున్నారు.

అయితే తాజాగా ఉత్తర కన్నడలోని లగ్నపత్రిక సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వెడ్డింగ్ కార్డు వీక్షించినా జనాలందరూ ముక్కుపై వేలేసుకుంటున్నారు. వివరాల్లోకెళ్తే.. ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపూర్ తాలూకాలోని కోర్సే అనే చిన్న గ్రామంలో నివసించే శ్రీపాద భట్ అనే వ్యక్తి తన కుమార్తె లగ్న పత్రిక కోసం భిన్నంగా ఆలోచించి, తయారు చేయించారు. కుమార్తె లగ్న పత్రికను తాటిచెట్లలో ముద్రించారు. తాటి చెట్లతో ఏంటి వింతగా అని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే.. ప్రస్తుతం తాటి వార్తాపత్రికలు ఉపయోగంలో చాలా తక్కువగా ఉన్నాయి. మ్యూజియంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ తాటి చెట్లపై చేతితో రాసి, ముద్రించి పెళ్లి ఆహ్వాన కార్డులను ముద్రించి మొట్టమొదటగా పంపిణీ చేసిన వారు మాత్రం వీరే అని చెప్పుకోవచ్చు. ఈ డిఫరెంట్ ఆహ్వాన కార్డును హుబ్లీలోని రాజారామ్ హోడ్‌వేర్స్ షాప్ ముద్రించింది. ఇంట్లో తాటిచెట్లు ఉండడంతో పాటు శ్రీలతకు పర్యావరణంపై ఉన్న ప్రేమ, శ్రీ పాద భట్ వారసత్వం ఈ కొత్త ప్రయత్నానికి నాంది పలికింది. కాగా ఈ వెరైటీ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed