- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారుతో ప్రేమలో పడ్డ వ్యక్తి.. ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
దిశ, ఫీచర్స్ : మనం చాలామంది వాహన ప్రియులను చూస్తూ ఉంటాం. అలాంటి వారు వారి వాహనాలను భద్రంగా మంచి కండిషన్ లో ఉండేట్టు చూసుకుంటారు. కానీ ఓ కార్ లవర్ మాత్రం తనకు కార్ పై ఉన్న అభిమానాన్ని విచిత్రంగా చాటుకున్నాడు. అతను చేసిన పనిని చూసినవారు ఇదేం పిచ్చిరా నాయనా అంటూ చెవులు కొరికేసుకుంటున్నారు. ఇంతకీ అతను ఏం చేశాడు అనుకుంటున్నారా. అయితే ఇప్పుడు తెలుసుకుందాం.
డైలీ స్టార్ నివేదిక ప్రకారం 30 ఏళ్ల రాబిన్ బార్ట్లీ రెనాల్ట్ అనే వ్యక్తి స్పేస్ కార్ పట్ల తన అభిరుచిని పీక్ స్థాయికి పెంచుకున్నాడు. బార్ట్లీకి ఈ కారు అంటే చాలా ఇష్టం. అతను ఈ మోడల్‌కు చెందిన కార్లను ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 కార్లను కొనుగోలు చేశాడు. అంతే కాదు రెనాల్ట్ కంపెనీ 1984 నుండి ఈ కారును తయారు చేస్తోంది. బార్ట్లీ ఈ కారు ఉత్పత్తులు 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన కాలు మీద కారు పచ్చబొట్టు వేయించుకోవాలని నిర్ణయించుకుని వేయించుకున్నాడు.
ప్రస్తుతం బార్ట్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పచ్చబొట్టు ఫోటోను షేర్ చేసుకుంటూ ఇలా రాశాడు. కొంతమంది స్నేహితులు నా ఈ అభిరుచిని తమాషాగా భావించారు. మరికొందరు నేను 'ఎక్సెంట్రిక్'గా మారానని చెప్పారు. కానీ నేను స్పేస్‌ని చాలా ప్రేమిస్తున్నాను కాబట్టి నేను పూర్తి స్పృహతో ఈ నిర్ణయం తీసుకున్నాను అని ట్యాగ్ చేశాడు. ఈ పోస్టును చూసిన వారిలో కొంతమంది 'మీ అంకితభావానికి వందనం' అని వ్యాఖ్యానించగా, మరికొందరు 'పచ్చబొట్టు పెట్టుకోవడం పిచ్చి అని కామెంట్ చేశారు.