Leave letter:‘‘నేను రాను, రానంటే రానంతే’’..క్లాస్ టీచర్‌కు ఓ స్టూడెంట్ లీవ్ లెటర్(వైరల్)

by Jakkula Mamatha |   ( Updated:2024-08-14 08:57:39.0  )
Leave letter:‘‘నేను రాను, రానంటే రానంతే’’..క్లాస్ టీచర్‌కు ఓ స్టూడెంట్ లీవ్ లెటర్(వైరల్)
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరి లైఫ్‌లో చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆనాటి మెమోరీస్ గుర్తు వస్తే చాలు ఎవరు నవ్వు ఆపుకోలేరు. మళ్లీ ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది. బాల్యం ఎంత మధురమైన అనుభూతిలను ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరూ ఆ స్టేజ్ నుంచి వచ్చిన వారే..అందరికీ బాల్యం విలువ తెలిసే ఉంటుంది. తల్లిదండ్రులు బడికి పంపుతూంటే అప్పుడు ఉండే ఫీలింగ్ ప్రస్తుతం గుర్తుచేసుకంటే పొట్టచెక్కలవ్వడం ఖాయం. స్కూలుకు వద్దు మీతోనే ఉంటా..అని వెక్కి వెక్కి ఏడ్చిన ఆ క్షణం మర్చిపోలేము ఇప్పటికీ ఎన్నటికీ కదా! అంతేకాదు ఆనందంగా గడిపే వేసవి సెలవులు, బావి నీళ్లల్లో ఈత నేర్చుకోవడాలు, సైకిల్ నేర్చుకోవాలంటే కింద పడిపోవడం ఇలా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మనకు అందించింది బాల్యం. అయితే ఒకప్పుడు ప్రతి వారి బాల్యం ప్రకృతి సమస్తంతో మమేకం అయితే ఇప్పటి ఎలక్ట్రానిక్ యుగంలో చాలా మంది పిల్లలు ఇంట్లోనే మొబైల్ ఫోన్లలోనే గడుపుతున్నారు.

అసలు విషయంలోకి వెళితే..బాల్యంలో మాత్రం చాలా మందికి స్కూల్‌కి వెళ్లడం అంటే ఇష్టం ఉండదు. ఈ క్రమంలో ఎప్పుడైనా స్కూల్ ఎగ్గొట్టాల్సి వస్తే మాత్రం ఆ సంతోషం మామూలుగా ఉండదు. అలాంటి సంతోష సమయంలో ఓ బాలుడు తన క్లాస్ టీచర్ కు రాసిన లీవ్ లెటర్ ప్రజెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఓ టీచర్‌కు రాసిన లెటర్ చదువుతుంటే నవ్వు ఆపుకోలేరు. ఇన్ స్టా పోస్ట్ వివరాల మేరకు సదరు విద్యార్థి పేరు రాకేశ్ అని తెలుస్తోంది. స్కూలుకు రావట్లేదు అంటూ తన క్లాస్ టీచర్‌కు సమాచారం ఇచ్చేందుకు రాకేష్ రాసిన లెటర్ మొదట పద్ధతి ప్రకారమే మొదలైంది.

స్కూల్ ప్రిన్సిపాల్‌ను అడ్రస్ చేస్తూ మరీ..డియర్ మేడమ్ అంటూ ప్రారంభించిన రాకేశ్.. ఆపై హిందీ భాషాని ఎంచుకున్నాడు. అది కూడా ఇంగ్లీష్ అక్షరాలు.. ‘మై నహీ ఆవుంగా, నహీ ఆవుంగా, నహీ ఆవుంగా’ (నేను రాను, రానంటే రానంతే) అంటూ డిక్లేర్ చేసేశాడు. ఆపై థాంక్స్ చెబుతూ మరోసారి స్కూల్ కి వచ్చేదే లేదంటూ తేల్చిచెప్పాడు. దానికింద తన పేరు, డేట్ వేసి లీవ్ లెటర్‌ను ముగించేశాడు. ఈ లెటర్‌ను ఇంట్లో వాళ్లు ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ విద్యార్థి లెటర్ రాసిన తీరు, అందులోని భాష, స్పెల్లింగ్ మిస్టేక్ లను చూసి నెటిజన్లు నవ్వుతూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed