Snake Video: గుండెపోటుతో మరణించిన పాము.. వైరల్ అవుతున్న వీడియో

by Prasanna |
Snake Video: గుండెపోటుతో మరణించిన పాము.. వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియాలో రోజుకొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. దీనికి సమయం, సందర్భం అంటూ ఏమి ఉండదు.. ఏది కొత్తగా కనిపిస్తే అది నిముషాల్లోనే ట్రెండ్ అవుతుంది. ఇలాంటి వీడియోలను నెట్ లో రోజుకి ఎన్నో చూస్తాము వాటిలో కొన్ని ఫన్నీగా, మరి కొన్ని ఎమోషనల్ గా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల గుండె పోటు వస్తుంది. దీని వలన కొంత కాలం నుంచి ఈ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

అయితే, మనుషులకు రావడం సహజం జంతువులకు కూడా గుండె పోటు వస్తుందన్న విషయం చాలా మందికి తెలీదు. పాము ఆడుతుండగానే క్షణాల్లో ప్రాణం విడిచి పెట్టింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పాముకు హార్ట్ ఎటాక్ రావడం వలన ఇలా ప్రాణాలు విడిచిందంటూ చెబుతున్నారు. అయితే, మనిషి లాగే పాముకు గుండెపోటు వస్తుందా అది కూడా నిముషాల్లోనే మరణిస్తుందా అంటూ నెటిజెన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed