రక్తంతో స్నానం చేసి సముద్రంలోకి దూకిన వ్యక్తి.. తరువాత ఏమి జరిగిందో చూడండి.. వైరల్ వీడియో..

by Sumithra |   ( Updated:2024-05-15 10:26:23.0  )
రక్తంతో స్నానం చేసి సముద్రంలోకి దూకిన వ్యక్తి.. తరువాత ఏమి జరిగిందో చూడండి.. వైరల్ వీడియో..
X

దిశ, ఫీచర్స్ : కొంతమంది వ్యక్తులు ఏదో ఒక విషయాన్ని నిరూపించేందుకు ఏవేవో ప్రయోగాలను, స్టంట్లను చేస్తూ ఉంటారు. అలాగే ఓ వ్యక్తి షార్క్ తనపై దాడి చేస్తుందో లేదో అని పరీక్షించేందుకు ఏకంగా రక్తాన్ని ఒంటికి పూసుకుని సముద్రంలోకి డైవ్ చేసి ఓ ప్రత్యేకమైన బోనులో దిగాడు. సముద్రంలో మానవ రక్తం కలిసినప్పుడు సొరచేపలు ఎలా స్పందిస్తాయో చూడడానికి ఈ ప్రయోగం చేశారట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఈ సాహసం గురించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

లాడ్‌బిబుల్ నివేదిక ప్రకారం మాజీ నాసా ఇంజనీర్ మార్క్ రాబర్ ఓ యూట్యూబర్‌గా మారాడు. ఆయన యూట్యూట్ లో పెట్టేందుకు ఓ భయానక ప్రయోగాన్ని చేసేందుకు బహామాస్‌కు వెళ్లాడు. ఈ సాహసం చేసే సమయంలో షార్క్ డైవింగ్ నిపుణుడు ల్యూక్ టిప్పల్ కూడా అతనితో ఉన్నాడు. ఈ ప్రయోగంలో భాగంగా ముందుగా మార్క్ తన రక్తపు చుక్కలను కొన్నింటిని సముద్రంలో పడేశాడు. దాదాపు గంట గడిచిపోయినా షార్క్ జాడ కనిపించలేదట.

అలాగే మరుసటి సంవత్సరం అతను మళ్లీ బహామాస్‌కు తిరిగి వెళ్లాడు. ఈసారి చేపల రక్తంతో షార్క్‌ను ఆకర్షించడానికి ప్రయత్నించాడు. వారు బ్లెండర్‌ను ఉపయోగించి ఐదు గ్యాలన్ల చేపల రక్తంతో స్మూతీని తయారు చేసి, ఆపై షార్క్ ప్రతిచర్యను వీక్షించారు. ఆ తర్వాత దాని స్థానంలో ఆవు రక్తాన్ని ఉపయోగించిన చెక్ చేశారు. చేపల రక్తం 134 సొరచేపలను ఆకర్షించిందని, క్షీరద రక్తం ఎనిమిది సొరచేపలను మాత్రమే ఆకర్షించిందని వారు కనుగొన్నారు. దీని తర్వాత అతను ఇప్పుడు ఒక పెద్ద ప్రయోగం కోసం చేపల రక్తాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు.

మరుసటి రోజు చేపల రక్తంతో చేసిన స్మూతీతో స్నానం చేసి సుముద్రంలో దిగి, బోనులో బందీలా అయ్యాడు. ఆ తరువాత పరిస్థితి భయానకంగా మారింది. వారి చుట్టూ రక్తం నిండిపోవడం ప్రారంభించిన వెంటనే, సొరచేపల గుంపు పంజరం పై దాడి చేసింది. ఇది చూసి వారు మొదట భయపడ్డారు. వారు బోనులో ఉన్నారని భావించి కాస్త భయం పోగొట్టుకున్నారు. అయితే, ఒక షార్క్ పంజరం లోపల తల పెట్టింది. దీంతో ఆ వ్యక్తి కాస్త భయపడ్డాడు.

https://youtu.be/vePc5V4h_kg?si=r9bNPLJly8Ru1tSJ

Advertisement

Next Story