మందుబాబులకు అలెర్ట్.. ఫారిన్ బ్రాండ్లు తాగుతన్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

by Indraja |
మందుబాబులకు అలెర్ట్.. ఫారిన్ బ్రాండ్లు తాగుతన్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!
X

దిశ వెబ్ డెస్క్: మందుబాబులం మేము మందుబాబులం ఫారిన్ బ్రాండ్లే తాగుతుంటాం అని ఫారిన్ బ్రాండ్లు తాగుతూ గొప్పలు పోతున్నారా..?అయితే అలాంటి వాళ్లకు తిప్పలు తప్పవు అని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కలియుగం కాదు కల్తీ యుగం నడుస్తోంది. ఈ కల్తీ యుగంలో గంజిలో వేసుకునే ఉప్పు నుండి గొంతులో పోసుకునే మద్యం వరకు కల్తీ జరుగుతోంది.

ముఖ్యంగా ఫారిన్ బ్రాండ్ సీసాల్లో చీప్ లిక్కర్ పోసి మందుబాబులను మాయ చేసి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా కొందరు వ్యక్తులు ఖరీదైన మద్యం బాటిళ్లను కల్తీ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో కేటుగాళ్లు మద్యం సీసాలని ఎలా కల్తీ చేస్తున్నారో పోలీసులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో లో ఓ వ్యక్తి ముందుగా ఖరీదైన స్కాచ్ బాటిల్ తీసుకుని, దాని మూతను స్క్రూడ్రైవర్‌తో తీసేస్తాడు.

తర్వాత హీటర్‌తో సీసాను వేడి చేస్తాడు. ఇలా మూతను మొత్తం సింపుల్‌గా తీస్తాడు. ఆ తరువాత అందులో కల్తీ మద్యాన్ని నింపుతాడు. చివరగా మళ్లీ మూతను యథావిధిగా పెట్టి లాక్ చేస్తాడు. ఫైనల్‌గా చూస్తే ఆ బాటిల్ స్కాచ్ బాటిల్ లాగానే కనిపిస్తుంది. అలానే ఖరీదైన ఖాళీ ఓడ్కా బాటిల్‌ను తీసుకుని, అందులో కల్తీ ఓడ్కా మందును నింపాడు. ఆ తర్వాత ఒరిజినల్ బాటిల్ మూతను బిగిస్తాడు. అనంతరం పైన ప్లాస్టిక్ కవర్ పెట్టి దానిని హీటర్‌తో వేడి చేస్తాడు.

ఫైనల్ గా ఆ బాటిల్ ను చూడడానికి ఖరీదైన ఓడ్కా బాటిల్ లానే కనిపిస్తుంది. ఇలా ఖరీదైన మద్యం బాటిళ్లను ఎలాంటి అనుమానం రాకుండా కల్తీ చేశాడు. కాగా ఆ వీడియో చూసిన నెటిజన్స్ షాక్ కు గురవుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Next Story