- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రవాణా కమిషనర్‌కు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ జేఏసీ వినతి
దిశ, న్యూస్‌బ్యూరో: వాణిజ్య ప్రజా రవాణా, సరుకు రవాణా వాహనాలకు త్రైమాసిక పన్ను రద్దు చేయడంతో పాటు రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీలోని పలు కార్మిక సంఘాల నేతలు మంగళవారం రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఎం.ఆర్.ఎం రావుకు వినతి పత్రమిచ్చారు. అంతకముందు ర్యాలీగా బయలు దేరిన నేతలు పోలీసుల భద్రతతో రవాణా కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. 6నెలల పాటు రోడ్డు పన్ను రద్దు చేయడంతో పాటు బోర్డర్ పన్ను రద్దు చేయాలని కోరారు.
తెల్లరేషన్ కార్డు తొలగించిన డ్రైవర్లకు తక్షణమే కార్డులు పునరుద్ధరించి 12కిలోల బియ్యంతో పాటు రూ.1500 నగదు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ ఐటీ కంపెనీలకు కాంట్రాక్టు పద్ధతిన క్యాబులు నడుపుతూ ప్రస్తుతం ఉపాధి కోల్పోయిన వారికి ఆయా కంపెనీల సీఎస్ఆర్ నిధుల నుంచి సహాయం చేయాలని కోరారు. ఓలా, ఉబెర్ ఇతర అనువర్తన ఆధారిత కంపెనీలు మహమ్మారిని నియంత్రించే చర్యలు ఓపక్క చేపడుతూ వాటి కమీషన్లు 5శాతం తగ్గించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని జేఏసీ నేతలు షేక్ సలావుద్దీన్, వెంకటేష్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.