‘లక్షణాలు ఉన్నా… ఎవరూ భయపడొద్దు’

by Sridhar Babu |
‘లక్షణాలు ఉన్నా… ఎవరూ భయపడొద్దు’
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ప్రగతి మైదాన్‌లో అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం అహర్నిశలు శ్రమిస్తున్నాడని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ముందుకు పోతున్న తెలంగాణ అభివృద్ధిలో ఎన్నో రాష్ట్రాలకి ఉదాహరణగా చూపించే స్థాయికి తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు.

కరోనా నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్న కొత్తగూడెం జిల్లాలో ఎలాంటి లక్షణాలు ఉన్న ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, కరోనాకు సంబంధించి అన్ని రకాల పరీక్ష సామాగ్రి అందుబాటులో ఉన్నాయనీ, రాపిడ్ టెస్టింగ్ కిట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ ఎన్వీ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed