రాష్ట్రవ్యాప్తంగా 12మంది జిల్లా జడ్జీల బదిలీ

by Shyam |
రాష్ట్రవ్యాప్తంగా 12మంది జిల్లా జడ్జీల బదిలీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా 12మంది జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31వ తేదీ లోగా వీరు కొత్త స్థానాలకు చేరుకుని బాధ్యతలను చేపట్టాలని స్పష్టం చేశారు. పాత పదవీ బాధ్యతల నుంచి తప్పుకునే ముందే రిజర్వులో ఉంచిన పెండింగ్ తీర్పులను వెలువరించాలని స్పష్టం చేశారు. పాత స్థానాల నుంచి రిలీవ్ అయ్యి కొత్త పోస్టుల్లో ఇంకా చేరని మధ్య కాలంలో ఇన్‌ఛార్జిలుగా ఉన్నవారు ఆ బాధ్యతలను నిర్వహించాలని, నిర్దిష్ట గడువులోగా కొత్త స్థానాల్లోకి వెళ్ళాల్సిందేనని స్పష్టం చేశారు. బదిలీ అయినవారిలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని కోఆపరేటివ్ ట్రిబ్యునల్, సిటీ సివిల్ కోర్టుల్లోని జడ్జీలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed