కొవిడ్ పేషెంట్లకు కరెంట్ కష్టాలు… ట్రాన్స్ కో కీలక ఆదేశాలు

by Sridhar Babu |   ( Updated:2021-05-13 02:10:25.0  )
కొవిడ్ పేషెంట్లకు కరెంట్ కష్టాలు… ట్రాన్స్ కో కీలక ఆదేశాలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అసలే వేసవి కాలం.. ఆపై ఈదురు గాలులు కూడా వచ్చే ప్రమాదం ఉందని భావించిన ట్రాన్స్ కో సంస్థ ముందస్తుగా సూచనలు ఇవ్వడం మొదలు పెట్టింది. వడగళ్ల బీభత్సం మూలంగా విద్యుత్ తీగలు తెగిపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని ట్రాన్స్ కో హెచ్చరిస్తోంది. దీనివల్ల ఆస్పత్రుల్లో చికిత్స పొందే కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ అందించడంలో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, అన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే మంచిందని ట్రాన్స్ కో సూచిస్తోంది.

Transco

ఈ మేరకు ట్రాన్స్ కో సీఎండీ కార్యాలయం సీజీఎం, జీఎంలకు మెమోను పంపించింది. కోవిడ్ చికిత్స అందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకుని కరోనా బాధితులకు నిరంతరం వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అన్ని ఆసుపత్రుల్లో జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని కోరింది. జనరేటర్లలో సాంకేతిక పరమైన సమస్యలు ఉంటే వెంటనే బాగు చేయించుకోవాలని, అసలే లేనట్టయితే కొత్తవి కొనుగోలు చేసుకోవాలని ఆ లేఖలో ట్రాన్స్ కో కోరింది.

Advertisement

Next Story

Most Viewed