ఆహాలో విడుదలవుతున్న ‘ట్రాన్స్’

by Shyam |
ఆహాలో విడుదలవుతున్న ‘ట్రాన్స్’
X

కరోనా వల్ల సినీప్రియులంతా.. ఓటీటీల వైపు చూస్తున్నారు. చిత్ర నిర్మాతలకు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్ మంచి ఆప్షన్‌గా కనిపించడంతో తమ సినిమాలను అందులోనే విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటీటీ ప్లామ్‌ఫామ్స్ మధ్య కూడా పోటీ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే.. అల్లు అరవింద్ ‘ఆహా’ యాప్ మిగిలిన స్ట్రీమింగ్ యాప్స్‌కు మంచి పోటీనిస్తోంది. ఇటీవలే ‘భానుమతి అండ్ రామకృష్ణ’ సినిమాను ఆహాలో రిలీజ్ చేశారు. స్ట్రెయిట్ తెలుగు చిత్రాల హక్కులను దక్కించుకుంటూనే.. తెలుగు డబ్బింగ్ సినిమాలను కూడా మంచి రేటుకు సొంతం చేసుకుంటోంది. సరైన సమయాల్లో వాటిని రిలీజ్ చేస్తూ.. ఓటీటీ యూజర్లను ఎంగేజ్ చేస్తోంది. లేటెస్ట్‌గా మళయాలంలో మంచి పేరు తెచ్చుకున్న ‘ట్రాన్స్’ సినిమాను తెలుగులో ‘ఆహా’ విడుదల చేస్తోంది.

మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘ట్రాన్స్‌’. ఈ సినిమాలో ఫాహద్ రియల్ లైఫ్ పార్టనర్ నజ్రియా నజిమ్ కూడా నటించింది. డైరెక్టర్ గౌతమ్ మీనన్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. కాగా, అన్వర్ రషీద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఆగస్టు 7న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు, నటుడు గౌతమ్‌ మీనన్‌ ‘ట్రాన్స్‌’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.

Advertisement

Next Story