- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైల్వే ప్రయాణికులకు శుభవార్త
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంతో పాటుగా ఇతర ప్రాంతాలకు రైళ్లను దశలవారీగా పెంచుతున్నామని, కరోన ముందు నడిచే రైళ్లు 70 శాతం ఇప్పటికే నడుస్తున్నాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేష్ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. సిక్రిందాబాద్ పరిధిలో సుమారు 300 రైళ్లు ఉండేవని, అందులో 215 రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే 140 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1నుంచి కొన్ని రైళ్లు పెంచుతున్నామని, ఇవన్నీ సికింద్రాబాద్ జోన్ నుంచి వెళ్తాయని తెలిపారు. పూర్తిగా రైళ్లని రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఎక్కడ కూడా సాధారణ ప్రయాణికులు రావడానికి అనుమతి ఉండదని రాకేష్ స్పష్టం చేశారు. రిజర్వేడ్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయిని, వెయిటింగ్ లిస్ట్ ఉన్నవారిని కూడా అనుమతించడం లేదని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల పునరుద్ధరనపై ఇంకా స్పష్టత రాలేదని, కోవిడ్ కేసులు ఇంకా తగ్గని కారణంగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. పరిస్థితి బట్టి ఎంఎంటీఎస్ రైళ్ల ప్రకటన ఉంటుందని రాకేష్ వెల్లడించారు.
ఏప్రిల్ నుంచి కొన్ని రైళ్లు
వచ్చేనెల 1 నుంచే కొన్ని రైళ్లు మొదలవుతాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం వెల్లడించారు. సికింద్రాబాద్–కర్నూల్ సిటీ, బీదర్– హైదరాబాద్, కాచిగూడ–రేపల్లె, గుంటూరు– వికారాబాద్, గుంటూరు– విశాఖపట్నం రైళ్లు ఏప్రిల్ నుంచి నడుపుతున్నట్లు చెప్పారు.
కరీంనగర్– తిరుపతి రైలు క్యాన్సిల్
సిగ్నల్, ఎలక్ట్రికల్ మరమ్మత్తుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ఈ నెల 4, 7, 11 తేదీల్లో కరీంనగర్–తిరుపతి (02762) రైలును రద్దు చేశారు. తిరుపతి నుంచి కరీంనగర్ రావాల్సిన రైలును కూడా రద్దు చేశారు. తిరుపతి– విశాఖపట్నం (02707) రైలును ఈ నెల 5, 7, 10, 12 తేదీల్లో, సికింద్రాబాద్– తిరుపతి (02770) రైతులను ఈ నెల 5, 9 తేదీల్లో, తిరుపతి–పూరీ (07479) రైలును ఈ నెల 5, 6,8,9,10,12 తేదీల్లో రద్దు చేసినట్లు ప్రకటించారు. అదే విధంగా భువనేశ్వర్–తిరుపతి (08479) రైలును ఈ నెల 6న, తిరుపతి–అమరావతి (02765) రైలును ఈ నెల 6,9 తేదీల్లో, తిరుపతి–బిలాసాపూర్ (07481) రైలును ఈ నెల 7,11 తేదీల్లో, తిరుపతి–భువనేశ్వర్ (02072) రైలును ఈ నెల 8న, తిరుపతి–కొల్హాపూర్ (07415) రైలును ఈ నెల 11న రద్దు చేశామని, తిరుగు రైళ్లు కూడా ఉండవని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. అదే విధంగా కడప–విశాఖపట్నం రైలు ఈ నెల 11, 12 తేదీల్లో తిరుపతిలో ఆగదని వెల్లడించారు. వీటితో పాటుగా నాగర్సోల్–శాలిమార్, రామేశ్వరం–ఓకా, యశ్వంతపూర్–తంతానగర్, యశ్వంత్పూర్–హాతియా రైళ్లను రేణిగుంట మీదుగా డైవర్ట్ చేసినట్లు పేర్కొన్నారు.