ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు భారీ షాక్

by Harish |   ( Updated:2021-10-01 05:45:11.0  )
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు భారీ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు టెలికాం శాఖ షాక్ ఇచ్చింది. రిలయన్స్ జియో సంస్థకు ఇంటర్ కనెక్టివిటీ తిరస్కరణకు సంబంధించి ఇరు సంస్థలకు ఐదేళ్ల క్రితం రూ. 3,050 కోట్ల జరిమానాను విధించారు. తాజాగా ఈ మొత్తాన్ని 3 వారాల్లోపు చెల్లించాలని టెలికాం శాఖా నోటీసులను జారీ చేసింది. 2016లో రిలయన్స్ జియో కొత్తగా టెలికాం సేవలను ప్రారంభించిన సమయంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఇంటర్ కనెక్టివిటీని ఆపేశాయి. ఈ అంశంపై అప్పట్లో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలపై ఆరోపణలు అధికమయ్యాయి. దానివల్ల జియో కస్టమర్లు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లకు ఫోన్ చేసిన వాటిలో 75 శాతం తిరస్కరణ సమస్యలు ఎదురయ్యాయి. ఈ అంశంపై రిలయన్స్ జియో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై చర్యలు తీసుకున్న ట్రాయ్ టెలికాం సంస్థల లైసెన్సులను రద్దు చేయాలని అనుకున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఈ సంస్థలకు చెందిన వినియోగదారులు ఇబ్బంది పడతారని జరిమానాతో సరిపెట్టింది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ సంస్థకు రూ. 1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియాకు రూ. 2,000 కోట్ల(వొడాఫోన్‌కు రూ. 1,050 కోట్లు, ఐడియాకు రూ. 950 కోట్లు) జరిమానా విధించింది. కానీ, ఇప్పటివరకు ఈ సంస్థలు జరిమానా కట్టలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా టెలికాం శాఖా జరిమానా విధించేందుకు మూడు వారాల గడువిస్తూ నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed