- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకపై టెలికాం కంపెనీలు పూర్తి డిజిటల్ : ట్రాయ్ ఛైర్మన్!
దిశ, వెబ్‌డెస్క్: పూర్తిస్థాయి సేవలను అందించే పెద్ద డిజిటల్ నెట్‌వర్క్‌లు (Digital networks)గా టెలికాం కంపెనీ (Telecom companies)లు అభివృద్ధి చెందుతున్నాయని, వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, వర్చువల్ అప్లికేషన్ ఇలా అన్ని విభాగాలు సాధారణమవనున్నట్లు ట్రాయ్ తెలపింది. ఇది టెలికాం రంగంలో సానుకూల అభివృద్ధిని సూచిస్తుందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ అన్నారు. కరోనా (Covid-19) సంక్షోభం నేపథ్యంలో 24 గంటలు కనెక్టివిటీ కొనసాగించడానికి టెలికాం రంగాన్ని షైనింగ్ స్టార్‌గా అభివర్ణిస్తున్నట్టు శర్మ తెలిపారు.
టెలికాం రంగం ఇప్పుడు సమాజంలో ఇదివరకెన్నడూ లేనంత ప్రాముఖ్యతను సంతరించుకుంది, ఈ ధోరణి ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు శర్మ పేర్కొన్నారు. ‘ఈ అవకాశాన్ని వృథా చేయకూడదు, డిజిటల్ సూపర్ పవర్, నాలెడ్జ్ సొసైటీ (Knowledge socity) గా అవతరించేందుకు అవకాశంగా మలుచుకోవాలని శర్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే, టెలికాం రంగం (Telecom sector)లో సేవలను మెరుగు పరిచేందుకు, వనరులను అనుకూలంగా మార్చుకునేందుకు పెద్ద టెలికాం కంపెనీలు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (Articficail inteligence), బిగ్ డేటా (Big data), మెషిన్ లెర్నింగ్ విధానాలను గణనీయంగా ఉపయోగిస్తున్నట్టు శర్మ వెల్లడించారు.
టెలికాం రంగంలోని కంపెనీలు పూర్తి డిజిటల్ నెట్‌వర్క్‌ల దిశలో వెళ్తున్నాయి. ఇంకా ఇతర సేవలను కూడా అందిస్తాయని శర్మ పేర్కొన్నారు. దీన్ని తాను సానుకూల పరిణామాంగా చూస్తున్నట్టు, రానున్న కాలంలో ఇది సాధారణం కానుందని, ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ ఎడ్యుకేషన్ లాంటి ఇతర అంశాలు ఉండనున్నాయని తెలిపారు.