- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
20రోజులు ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ ప్రాంతాలంటే !
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ఆఘాపూర్ నుంచి బోయిగూడ కమాన్ వరకు రోడ్డు నిర్మాణం నేపథ్యంలో ఈనెల 21వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. అలస్కా, దారుసలాం నుంచి మెహిదీపట్నం వెళ్లేవారు ఆఘాపూర్ క్రాస్‌రోడ్ నుంచి చర్కన్‌దిల్, కేఫ్ తాబండా, బడీమసీదు నుంచి ఎడమ వైపు మల్లేపల్లి క్రాస్‌రోడ్ మీదుగా మెహిదీపట్నం వెళ్లాల్సి ఉంటుందన్నారు. దారుసలాం నుంచి పురానాపూల్ వెళ్లే వాహనదారులు ఆఘాపూర్ క్రాస్‌రోడ్ నుంచి ఆఘాపూర్ గోడెకి ఖబర్, జుమ్మెరాత్ బజార్ టీ జంక్షన్, గాంధీ విగ్రహాం మీదుగా పురానాపూల్ వెళ్లాలన్నారు.
మంగళ్‌హాట్ వైపు నుంచి నాంపల్లి వచ్చే వాహనదారులు ఆర్కేబ్రాస్ బాండ్ వద్ద కుడివైపుగా ఆఘాపూర్, ఆఘాపూర్ క్రాస్‌రోడ్, చర్కన్ దిల్, కేఫ్ తాబండ టీజంక్షన్ అండ్ నాంపల్లి జంక్షన్‌కు చేరుకోవాలన్నారు. అలస్కా వైపు నుంచి మెహిదీ పట్నం వచ్చే భారీ వాహనాలు దారుసలాం, ఏక్ మీనార్ మసీదు, యూసుఫెయిన్ దర్గా క్రాస్‌రోడ్ బజార్‌ఘాట్ క్రాస్‌రోడ్, విజయ్‌నగర్ కాలనీ, మాసబ్‌ట్యాంక్ మీదుగా మెహిదీపట్నం వెళ్లాలన్నారు. మెహిదీపట్నం వైపు నుంచి ఎంజే మార్కెట్ అండ్ పురానాపూల్ వచ్చే భారీ వాహనాలు మల్లేపల్లి క్రాస్ రోడ్ వద్ద ఎడమ వైపు తిరిగి విజయ్‌నగర్ కాలనీ, బజార్‌ఘాట్ క్రాస్‌రోడ్, యూసుఫెయిన్ దర్గా క్రాస్‌రోడ్, ఏక్ మీనార్ తాజీస్ ల్యాండ్, మాలకుంట, ఎంజే బ్రిడ్జి, జుమ్మెరాత్ బజార్ చేరుకోవాలన్నారు.