ఇంటర్ విద్యార్థులకు ట్రా‘ఫికర్’

by Shyam |   ( Updated:2020-03-04 00:00:06.0  )
ఇంటర్ విద్యార్థులకు ట్రా‘ఫికర్’
X

దిశ, హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. లోడ్‌తో ఉన్న ఇసుక లారీ మెయిన్ రోడ్ మీద మలుపు వద్ద ఆగిపోయింది. దీంతో నాగోల్ నుంచి హబ్సిగూడ వెళ్లే వాహనాలతో పాటు ఉప్పల్ నుంచి రామంతపూర్, సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలకు కీలకమైన యూ-టర్న్ మీదనే లారీ ఆగడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇంటర్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు, ఆఫీసులకు వెళ్తున్న వారికి ఆలస్యం అవుతోంది. ఇద్దరు ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను కంట్రోల్ చేస్తున్నారు.

Tags:Traffic jam, Uppal, inter exams, ring road, hyderabad

Advertisement

Next Story

Most Viewed