- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిగెత్తి ప్రాణం కాపాడిన పోలీస్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా మానవత్వాన్ని చాటారు. సాధారణంగా అంబులెన్స్ వస్తే దారి ఇవ్వాలని తెలిసిన వాహనదారులు, ప్రయాణికులకు సరికొత్త పాఠం నేర్పారు. విధి నిర్వహణలో ఉన్న ఆయన అంబులెన్స్ దారి కోసం పరిగెత్తుతూ వాహనాలను తప్పుకోవాలని సూచించాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.
ప్రతి అడుగు ప్రజల కోసం,
మీ భద్రతే మాకు ముఖ్యం. pic.twitter.com/ze9ErLSft7— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) November 4, 2020
హైదరాబాద్ మొజంజాహీ మార్కెట్ అంటేనే రద్ధీ వాతావరణం. దీనికి తోడు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో రద్దీ ప్రభావం అందరికీ తెలిసిందే. కాగా, ఇటువంటి సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని అంబులెన్స్ సాయంతో హాస్పిటల్ తరలిస్తున్నారు. సరిగ్గా మొహంజాహీ నుంచి కోఠి వెళ్లే దారిలో అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. స్వైరన్ కొడుతున్న ముందున్న వాహనాలు ఎటుపోవాలో తెలియక అక్కడే నిలిచిపోయాయి.
ఇదే సమయంలో అంబులెన్స్‌ను తన వెనుకే రమ్మంటూ.. అబిడ్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జి ముందున్న వాహనాలను రన్నింగ్ చేస్తూ పక్కకు తప్పుకోండి అంటూ సూచనలు చేస్తూ చివరకు అంబులెన్స్‌కు దారి ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. దీంతో కానిస్టేబుల్ బాబ్జిని నెటిజన్లు తెగపొగిడేస్తున్నారు. శభాష్ పోలీస్ అంటూ కొనియాడుతున్నారు.