అసెంబ్లీ గేటు కూడా తాక‌లేవ్‌.. జంగా రాఘ‌వ‌రెడ్డికి కంచె రాములు వార్నింగ్

by Shyam |
TPCC state secretary Kanche Ramulu
X

దిశ, జనగామ: భవిష్యత్తులో అసెంబ్లీ సీటు కాదు.. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డిపై టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కంచె రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జనగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ‘దళిత గిరిజన ఆత్మ దండోరా’ పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కంచె రాములు, పీఏసీసీ డైరెక్టర్ మల్లారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కంచె రాములు మాట్లాడుతూ.. జనగామ నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని‌, కనీసం జిల్లా ఓటరు కానీ రాఘవరెడ్డి, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వాడుకొని సర్వనాశనం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని మండిపడ్డారు.

పార్టీ నాయకులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని, లేకుంటే జనగామలో అడుగు పెట్టనివ్వబోమని జంగా రాఘవరెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ కౌన్సిలర్లు వంగల కల్యాణి, రామగాళ్ల అరుణ, విజయ్, మంత్రి సుమలత శ్రీశైలం, కమలమ్మ, మల్లిగారి చంద్రకళ రాజు, ఎస్సీ సెల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బక్క శ్రీనివాస్, కిసాన్ సెల్ అధ్యక్షులు కొన్నే మహేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మపురి శ్రీనివాస్, జనగామ మున్సిపల్ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఆకుల వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story