- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి మల్లారెడ్డికి మతి చలిచింది.. బండి సుధాకర్ గౌడ్ ఆగ్రహం
దిశ ప్రతినిధి, వరంగల్: మంత్రి మల్లారెడ్డికి మతి చలించిందని, అందుకే టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీపీసీసీ కార్యదర్శి సుధాకర్ గౌడ్ ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బుధవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో సుధాకర్ గౌడ్ పేర్కొన్నారు. మంత్రి అహంకారపూరితంగా, అవివేకంతో చేసిన వ్యాఖ్యలుగా అభివర్ణించారు. బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి దిగజారుడు పదజాలంతో మాట్లాడారంటూ విమర్శించారు. మూడుచింతలపల్లెలో రేవంత్‌రెడ్డి చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షకు వచ్చిన స్పందనను చూసే మంత్రి ఆక్రోశం వెల్లగక్కారన్నారు. మంత్రిగా ప్రమాణాస్వీకారం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తానని చేసిన మల్లారెడ్డికి ప్రతిజ్ఞ గుర్తు లేనట్లుందని ఎద్దేవా చేశారు. మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలను న్యాక్ బ్లాక్ లిస్టులో పెట్టింది నిజం కాదా? అని నిలదీశారు. అక్రమంగా భూకబ్జాలు చేసి వేల కోట్లు సంపాదించుకున్నది నిజం కాదా? అని అన్నారు. రేవంత్‌రెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే కార్యకర్తలు నిన్ను రోడ్డు మీద తిరగనియ్యరు.. ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.