రేవంత్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్..

by Shyam |   ( Updated:27 Jun 2021 3:38 AM  )
రేవంత్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్..
X

దిశ, తెలంగాణబ్యూరో : టీపీసీసీ కొత్త చీఫ్‌తో పాటుగా వర్కింగ్​ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, కొత్త టీం మొత్తం వచ్చేనెల మొదటి వారంలో బాధ్యతలను స్వీకరించనున్నట్లు కాంగ్రెస్​ వర్గాలు వెల్లడించాయి. ఈ మూడు రోజులూ ముహూర్తం అనుకూలించకపోవడంతో పాటుగా పార్టీలోని సీనియర్లతో రేవంత్​వరుసగా భేటీ అయి అందరితో చర్చించనున్నట్లు సమాచారం. గాంధీభవన్‌లో ప్రత్యేక పూజలు చేసి ఇందిరా, రాజీవ్‌తో పాటు పలువురు నేతల చిత్రపటాలకు నివాళులర్పించి రేవంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

జూలై మొదటి వారంలో ఆయన బాధ్యతలు చేపట్టేలోపు, పార్టీ ముఖ్య నేతలను ఒక్కొక్కరిని కలిసేందుకు ప్లాన్​చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్లు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టితో రేవంత్​ భేటీ అయ్యారు. ఇవ్వాలో, రేపో రాష్ట్రానికి రానున్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలను కూడా రేవంత్ కలువనున్నారు. అందరినీ తన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో కాంగ్రెస్​పార్టీ స్టేట్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో అన్ని వర్గాలను ఈ కార్యక్రమానికి పిలువనున్నారు. జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జీలను కూడా పిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Advertisement

Next Story