- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. పొలిటికల్ ప్లాన్ చేంజ్ చేసిన టీపీసీసీ
దిశ ప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇంద్రవెల్లి, రావిర్యాలలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా కార్యక్రమం విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 17న మూడో సభను వరంగల్‌లో నిర్వహించాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణికం ఠాగూర్ నిర్ణయించినట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించినప్పుడు సైతం ఇదే విషయాన్ని పలుమార్లు మాణికం ఠాగూర్ ప్రస్తావించినట్లు సమాచారం.
అయితే అధికారికంగా రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. హన్మకొండ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న హసన్‌పర్తిలోనే ఈ భారీ బహిరంగ సభ ఉండనుందని సమాచారం. దాదాపు రెండు లక్షల మందికి పైగా జనాన్ని సమీకరించాలని ప్రణాళికతో ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు కూడా భారీగా ఉండనున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఈ భారీ సభకు ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరుకానున్నారని కాంగ్రెస్ ముఖ్య నేతల ద్వారా తెలుస్తోంది. ఈ సభ ఏర్పాట్లకు ప్రాథమిక ప్రణాళిక రూపొందించేలా జిల్లా ముఖ్య నేతలకు సైతం మార్గనిర్దేశం చేసినట్లుగా ఓ కీలక నేత దిశకు వెల్లడించారు. వాస్తవానికి మూడో సభను ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్‌లో నిర్వహిద్దామని ముందుగా అనుకున్నా.. ఎందుకనో ఓరుగల్లు వైపే ముఖ్య నేతలు ఆసక్తి చూపినట్లు సమాచారం.