రేపు రేవంత్ రెడ్డి బర్త్ డే.. అభిమానులకు, కార్యకర్తలకు కీలక సూచన

by Anukaran |
RevanthReddy1
X

దిశ, వెబ్‌డెస్క్ : రేపు(సోమవారం) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్మదినం. ఆయన పుట్టినరోజు సందర్భంగా రేవంత్.. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. బర్త్ డే రోజున తాను తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అందువల్ల పార్టీ శ్రేణులకు, అభిమానులకు అందుబాటులో ఉండటంలేదని తెలిపారు.

ఈ సందర్భంగా.. నా అభిమానులకు విజ్ఞప్తి. పేదలు, అనాథలకు మీకు తోచిన విధంగా సాయం చేయండి. మీరు వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు చెప్పిన దానికంటే అదే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుందని అన్నారు.

Advertisement

Next Story