- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. మానవ అక్రమ రవాణాలో తెలంగాణ నెం.1
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో డ్రగ్స్, మత్తుపదార్థాలను నిరోధించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైట్ చాలెంజ్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటగా మంత్రి కేటీఆర్, కొండా విశ్వేశ్వర రెడ్డికి సవాల్ విసిరారు. ఇలా మంత్రి కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ట్వీట్ ప్రకారం..‘‘ మానవ అక్రమ రవాణాలో తెలంగాణ నెంబర్ వన్.. ఇది ఎన్సీఆర్బీ తేల్చిన లెక్క. ఎవరిదీ పాపం? ఎవరిదీ నేరం? సర్కారుకు బాధ్యత ఉండక్కర్లేదా!? ప్రశ్నిస్తే అసహనం దేనికి? అడుగుతోంది తెలంగాణ సమాజం. కేసీఆర్.. ఏదీ నీ సమాధానం!?’’ అని ట్వీట్ చేశారు. అంటే మానవ అక్రమ రవాణాలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని NCRB తేల్చిందని.. సీఎం కేసీఆర్ దీనిపై స్పందించాలంటూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు చర్చిస్తూ.. సమాధానం చెప్పాలంటూ రీట్వీట్లు చేస్తు్న్నారు.
మానవ అక్రమ రవాణాలో తెలంగాణ నెంబర్ వన్….ఇది ఎన్సీఆర్బీ తేల్చిన లెక్క. ఎవరిదీ పాపం? ఎవరిదీ నేరం? సర్కారుకు బాధ్యత ఉండక్కర్లేదా!? ప్రశ్నిస్తే అసహనం దేనికి? అడుగుతోంది తెలంగాణ సమాజం. కేసీఆర్… ఏదీ నీ సమాధానం!? pic.twitter.com/xhUZrgiYQu
— Revanth Reddy (@revanth_anumula) September 20, 2021