పోతిరెడ్డిపాడుపై టీపీసీసీ ఆందోళన

by Shyam |
పోతిరెడ్డిపాడుపై టీపీసీసీ ఆందోళన
X

దిశ, న్యూస్‌బ్యూరో: పోతిరెడ్డిపాడుపై తెలంగాణ కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. కృష్ణా జలాలను తరలిచేందుకు ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలపై మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోతిరెడ్డిపాడు వ్యతిరేక కమిటీని నియమించింది. ఈ మేరకు మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. ఛైర్మన్‌గా నాగం జనార్థన్‌రెడ్డి, సలహాదారులుగా జానారెడ్డి, వీహెచ్, సభ్యులుగా చిన్నారెడ్డి, చంద్రశేఖర్, ప్రసాద్‌కుమార్, మాజీ ఎంపీలు మల్లు రవి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బాలు నాయక్, కర్నాటి లింగారెడ్డి, రామలింగ యాదవ్, దొంగరి వెంకటేశ్వర్లు, ఎల్ఎన్‌రెడ్డి, రామ్మోహన్‌ను నియమించారు.

Advertisement

Next Story