వాటా దక్కకపోతే కేసీఆర్‌దే బాధ్యత

by  |
వాటా దక్కకపోతే కేసీఆర్‌దే బాధ్యత
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి. పోతిరెడ్డిపాడు విషయంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించుకుపోతామని జగన్ ప్రకటించినా కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సుప్రీంలో వేసిన పిటిషన్‌లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఆపేందుకు ఒక్క అంశం కూడా అందులో లేదని.. కృష్ణా జల్లాలో రాష్ట్రానికి వాటా దక్కకపోతే అందుకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ మీటింగ్ కన్నా క్యాబినెట్ భేటీలు ముఖ్యామని ఆయన ప్రశ్నించారు.


Next Story

Most Viewed