కుక్కలు మొరగడం కామన్.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై బొత్స ఫైర్

by Anjali |   ( Updated:2024-04-26 11:33:02.0  )
కుక్కలు మొరగడం కామన్.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై బొత్స ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మీడియా సమావేశంలో మంత్రి బొత్స ఖండించారు. అబద్దాలతో ప్రజలను మోసం చేయాలనుకోవడం తగదని మండిపడ్డారు. పీయూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. విద్యాశాఖపై వస్తోన్న ఆరోపణలు నిరూపించాలని, అందులో నిజం లేదు కాబట్టే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పత్రికలు దురుద్ధేశంతో తప్పులు వార్తలు రాసి జనాలను నమ్మించాలని చూస్తున్నాయని మండిపడ్డారు.

ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి.. రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడైన విద్యాశాఖ మంత్రిగా ఉన్న నాపై వేలు ఎత్తి చూపించగలరా..? అసలు విద్యాశాఖలో అవినీతి జరిగిందని చెప్పగలరా..? అని ప్రశ్నించారు. రైల్వేకు ఎప్పుడో భూములు స్వాధీనపరిచామని క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో ఎవరొచ్చినా మాకు ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు. కానీ మాపై ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని మంత్రి బొత్స వెల్లడించారు.

Advertisement

Next Story