వార్త‌ల్లో దిశ డైన‌మిజం

by Kalyani |
వార్త‌ల్లో దిశ డైన‌మిజం
X

దిశ‌, హ‌న్మ‌కొండ : వార్త సేక‌ర‌ణ‌, ప్ర‌చుర‌ణ‌లో దిశ దిన‌ప‌త్రిక డైన‌మిజాన్ని చూపిస్తోంద‌ని వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ స‌త్య శార‌ద కొనియాడారు. ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి, పాల‌న యంత్రాంగానికి దిశ వార‌దిగా నిలుస్తోంద‌ని అన్నారు. శుక్ర‌వారం వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ స‌త్య శార‌ద త‌న కార్యాల‌యంలో దిశ నూత‌న సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ… ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెలికి తీయ‌డం, అధికారుల దృష్టికి తీసుకురావ‌డంతో ప‌రిష్కారానికి అవ‌కాశాలు క‌ల్పిస్తోంద‌ని అన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల‌ను డైనమిక ఎడిష‌న్ల ద్వారా పాఠకుల‌కు అంద‌జేయ‌డం మంచి విష‌య‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వ‌రంగ‌ల్ జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ సంధ్యారాణి, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా బ్యూరో చీఫ్ అరెల్లి కిర‌ణ్ గౌడ్‌, హ‌న్మ‌కొండ ఆర్‌సీ ఇన్చార్జి ఉమ్మాల సందీప్ పాల్గొన్నారు.

Advertisement

Next Story