BJP: ఆ విషయం ఈ దద్దమ్మకు తెలియదా..? రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్

by Ramesh Goud |
BJP: ఆ విషయం ఈ దద్దమ్మకు తెలియదా..? రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రైతులను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముక్కు నేలకు రాసి క్షమాపణలు(Sorry) చెప్పాలని మహబూబ్ నగర్(Mahaboob Nagar) బీజేపీ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) అన్నారు. రైతు భరోసా(Raithu Bharosa)పై మీడియాతో మాట్లాడిన ఆమె.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై ఫైర్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. రైతు భరోసా పేరుతో రేవంత్ రెడ్డి రైతులను పచ్చి మోసం చేసాడని, ఎన్నికలకు ముందు రూ.15000 ఇస్తామన్నోళ్లు ఇప్పుడెందుకు రూ.12000 ఇస్తామంటున్నారు అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల పాలైంది కాబట్టి ఇప్పుడు అమలు చేయలేం అంటున్నారని, ఎన్నికలకు ముందు ఈ హామీ ఇచ్చేటప్పుడు రాష్ట్రం అప్పుల పాలయిందని ఈ దద్దమ్మకు తెలియదా..? అని మండిపడ్డారు.

అలాగే కేవలం కుర్చీ కోసమే కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తుందని బీజేపీ ఆనాడే చెప్పిందని గుర్తు చేశారు. అంతేగాక ఇప్పుడు రైతు భరోసా ఎంత మందికి ఇస్తారో అనేది కూడా అనుమానమేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయానికే ఈ ప్రకటన చేశారని విమర్శించారు. ఇక రూ.15వేల రైతు భరోసా హామీ నెరవేర్చాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైనే ఉందని, అబద్దపు హామీలిచ్చినందుకు ముక్కు నేలకు రాసి రైతులకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేలా చేసేంత వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed