- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sankranti : గాలి పటమా పద పద.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
దిశ, ఫీచర్స్ : మరెంతో దూరం లేదు. వారం రోజులు గడిస్తే సంక్రాంతి వచ్చేసినట్లే.. అయితే ఈ ఫెస్టివల్ అంటేనే తెలుగు ప్రజల్లో అదో ఆనందం. అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, పల్లెటూర్లు, కోడిపందాలు వంటివన్నీ గుర్తుకొస్తాయి. ఇక విద్యా సంస్థలకు సెలవులు ఉంటాయి కాబట్టి పిల్లల సరదా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల్లో పతంగులు ఎగురవేయడం పిల్లలకు, పెద్దలకు కూడా మహా సరదా.. అదో తీపిజ్ఞాపకం. అందుకే ఒక్కసారైనా ‘గాలి పటమా పద పద’ అంటూ చేతిలో పతంగి పట్టుకొని ఆకాశంవైపు చూడనివారంటూ ఉండరు. ఇక్కడ ఆనందం, ఆట ఎంత ముఖ్యమో జాగ్రత్త కూడా అంతే ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. లేకపోతే గాలిపటాలు ఎగురవేసే క్రమంలో అది ఏ బిల్డింగ్పైనో, చెట్టు మీదనో, కరెంటు తీగల్లోనో ఇరుక్కుంటే తీసే ప్రయత్నంలో ప్రమాదాలు జరగొచ్చు. చైనా మాంజా వాడితే ప్రాణాలకే ప్రమాదమని పెద్దలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే గాలి పటాలను ఎగుర వేయడానికి ఎలాంటి ప్రదేశాలు సేఫ్, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకుందాం.
* గాలిపటం చక్కగా ఎగరాలంటే అందుకు స్థిరమైన గాలి ఉండాలి. అందుకోసం విశాలమైన పార్కులు, ఆరుబయట మైదానాలు, పొలాలు, బీచ్లు వంటి ఖాళీ ప్రదేశాల్లో పతంగులను ఎగురు వేయడం మంచిది. దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదు. అయితే చెట్లు, కరెంటు స్తంభాలు, విమానాశ్రయ సమీపంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గాలిపటాలు ఎగుర వేయకూడదు.
* జనవాసాల మధ్య పతంగులు ఎగుర వేయడం కూడా సురక్షితం కాదు. మరీ పదునైనా దారం గానీ, చైనా మాంజా గానీ వాడటం చాలా ప్రమాదకరం. పతంగులు ఎగుర వేసేటప్పుడు చెట్లు, బిల్డింగులు, కొండలు వంటివి అడ్డుగా లేనిచోటును ఎంచుకుంటే అవి పైకి ఎగరడానికి మంచి అవకాశం ఉంటుంది.
* పతంగులు ఎగురు వేస్తున్న క్రమంలో అనుకోకుండా విద్యుత్ స్తంభాలపైనో, వైర్ల మధ్యనో ఇరుక్కుంటే తీసే ప్రయత్నం అస్సలు చేయకూడదు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి. ప్రాణంకంటే ఏదీ ముఖ్యం కాదు కాబట్టి, ఇలాంటప్పుడు పతంగులను వదిలేయడం బెటర్. అవసరమైతే విద్యుత్ అధికారులను సంప్రదించవచ్చు. దీంతోపాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో గాలిపటాలు ఎగురువేసే ప్రయత్నం చేయవద్దు. ప్రజలు, వాహనదారుల మీద పడితే పతంగులు, వాటి దారం అడ్డు తగిలి కింద పడిపోవడం, కళ్లపై గాయాలు కావడం వంటివి జరగొచ్చు. చైనా మాంజా వాడితే గనుక అది కత్తికంటే పదునుగా వ్యక్తులను ప్రమాదానికి గురిచేస్తుంది. కాబట్టి చైనా మాంజా వాడపోవడం, సురక్షిత ప్రదేశాల్లో మాత్రమే పతంగులను ఎగురు వేయడం ముఖ్యమని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.