TPCC: బీసీలకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్.. టీపీసీసీ నేత సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
TPCC: బీసీలకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్.. టీపీసీసీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి(TPCC General Secretary) చరణ్ కౌశిక్ యాదవ్(Charan Kowshik Yadav) అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు(BC Reservations) 23 శాతంకు కుదించి బీసీలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని, బీసీలకు 11 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేసిందని మండిపడ్డారు. అలాగే గత ప్రభుత్వం హయాంలో బడ్జెట్ కేటాయింపుల్లో కూడా బీసీలకు అన్యాయమే జరిగిందని, ఆ కేటాయించిన బడ్జెట్ లో కూడా ఏ మాత్రం బీసీ ఖర్చు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేగాక బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసిన ఆలె నరేంద్ర(Ale Narendra), ఈటల రాజేందర్(Eatala Rajendar), తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah), విజయశాంతి(Vijayashanthi), శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ(Shankaramma)లకు వాళ్ళు ఎలాంటి గౌరవం ఇచ్చారో అందరం చూశామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం చేజారడంతో ఇప్పుడు బీసీల నినాదం ఎత్తుకొని కల్వకుంట్ల కవిత సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోందని విమర్శలు చేశారు. గతంలో ఆమె జాగృతి పేరుతో మహిళలను మోసగించి ఓట్లు దండుకున్నదని, ఇప్పుడు లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లొచ్చాక కొత్త ఎజెండా ఓట్ల కోసం రాజకీయాలు మొదలు పెట్టిందన్నారు. నిజంగా బీసీలపై బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే బీఆర్ఎస్ఎల్పీ లేదా బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఒక బీసీకి ఇవ్వాలని చరణ్ కౌశిక్ సవాల్ చేశారు.

Advertisement

Next Story