Nithish: పొరపాటున రెండు సార్లు వారితో పొత్తు పెట్టుకున్నా.. లాలూ వ్యాఖ్యలపై నితీశ్ స్పందన

by vinod kumar |
Nithish: పొరపాటున రెండు సార్లు వారితో పొత్తు పెట్టుకున్నా.. లాలూ వ్యాఖ్యలపై నితీశ్ స్పందన
X

దిశ, నేషనల్ బ్యూరో: తమ కూటమిలోకి వచ్చేందుకు నితీశ్‌కు తలుపులు తెరిచే ఉన్నాయని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad Yadav) చేసిన వ్యాఖ్యలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nithish kumar) స్పందించారు. పొరపాటున రెండు సార్లు వారితో పొత్తు పెట్టుకున్నామని, మళ్లీ జతకట్టే ఆలోచ లేదని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిహార్ (Bihar) కోసం గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని విమర్శించారు. గతంలో సాయంత్రం పూట మహిళలు బయటకు రావాలంటే భయపడేవారని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, దాని ఫలితంగానే నేడు చాలా మార్పు కనిపిస్తోందని కొనియాడారు. స్వయం సహాయక సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి జీవిక అని పేరు పెట్టామని, ఆ గ్రూప్‌లో చేరిన మహిళల స్థితిగతుల్లో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు.

Advertisement
Next Story

Most Viewed