రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

by Naveena |
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
X

దిశ,దేవరకద్ర: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం దేవరకద్ర మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ చైర్మన్, ఈశ్వర వీరప్పయ్య చైర్మన్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, వైస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి ,ఈశ్వర వీరప్పయ్య ఆలయ చైర్మన్ గా బీసు నరసింహారెడ్డి తో పాటు..12 మంది డైరెక్టర్ లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ..గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిన రుణమాఫీ వారు తీసుకున్న వ్యవసాయ రుణాల వడ్డీలకే సరిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికైనా ,రాష్టానికైన శ్రీరామ రక్ష అని అన్నారు.

అనంతరం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ..దేవరకద్ర మార్కెట్ కమిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తూ..రైతులకు పెద్దపీట వేస్తుందన్నారు. రైతులు బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నికల హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని,ఆరు గ్యారెంటీలను పక్కగా అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ సభ్యులు దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పదవులను బాధ్యతతో నిర్వర్తించి భవిష్యత్తులో మంచి స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ..కాంగ్రెస్ కార్యకర్తలకు వెన్నంటే ఉంటామని రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి,మద్నపురం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, మద్నాపురం కాంగ్రెస్ నాయకులు, టిపిసిసి ఆర్గనైజేషన్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, మండల అధ్యక్షులు అంజిల్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఫరూక్ అలీ, మాజీ జెడ్పిటిసి లక్ష్మీకాంత్ రెడ్డి, అప్పంపల్లి పిఎసియస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, జీకే ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోన రాజశేఖర్,మొగిలన్న, కురుమూర్తి దేవాలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కౌకుంట్ల యువజన అధ్యక్షులు నరేష్ ,ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story