వెల్దండ మండల విద్యాభివృద్ధి కోసం రూ.5 కోట్లు..

by Naveena |
వెల్దండ మండల విద్యాభివృద్ధి కోసం రూ.5 కోట్లు..
X

దిశ, వెల్దండ: రాష్ట్ర ప్రభుత్వం వెల్దండ మండల విద్యాభివృద్ధి కోసం రూ.5 కోట్ల రూపాయలను విద్యాశాఖ మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వెల్దండ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ బాలికల పాఠశాలకు రూ .10 లక్షలు, ఎంపీపీఎస్(ఎంఆర్సి) పాఠశాలకు డైనింగ్ హాల్, మూత్రశాలలు కు రూ.20 లక్షలు, జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో అదనపు గదులు , వంటగది, మూత్రశాలకు రూ. 200 లక్షలు మంజూరు చేశారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో వంటగది, కాంపౌండ్ వాల్ లకు రూ. 70 లక్షలు, ఆదర్శ పాఠశాలకు వంటగది, మూత్రశాలలకు రూ.50 లక్షలు, కస్తూర్బా గాంధీ పాఠశాలకు వంటగది, కాంపౌండ్ వాల్ లకు రూ.100 లక్షలు, ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలలో వంటగది, మూత్రశాలలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లకు రూ.50 లక్షల చొప్పున, మొత్తం రూ .5 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండల కేంద్రానికి విద్యాభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story