ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దు : ఉత్తమ్

by Anukaran |   ( Updated:2020-10-12 04:30:49.0  )
ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దు : ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో, ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో సోమవారం అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ… సిద్దిపేట, గజ్వేల్‌ను కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన హరీశ్ రావుకు దుబ్బాకకు ఎందుకు నిధులు తీసుకు రాలేదుని ప్రశ్నించారు.

దుబ్బాకకు రావాల్సిన పాలిటెక్నిక్ కాలేజీ సిద్దిపేటకు ఎందుకు తీసుకెళ్లారని.. దుబ్బాక వంద పడకల ఆసుపత్రి నిర్మించడానికి ఇంకా ఎన్నో ఏళ్ళు పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ఉన్న రోడ్లు చూసి ఓట్లు వేయాలని ప్రజలకు సూచించారు. టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా డౌన్ పాల్ మొదలైందని.. దానికి దుబ్బాక నాంది అవుతుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్, టీఆర్ఎస్ వద్దు.. కాంగ్రెస్ ముద్దు అని నినదించారు.

దుబ్బాకలో కాంగ్రెస్ సర్వే ప్రకారం… కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో హరీష్ భయపడో ఏమో.. ఇప్పుడు అభ్యర్థిని చూసి కాదు నన్ను చూసి ఓటు వేయండి అంటున్నాడని ఎద్దేవా చేసారు. గతంలో చెరుకు ముత్యంరెడ్డి దుబ్బాకను ఎలా అభివృద్ధి చేశారు… అతని తనయుడు శ్రీనివాస్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తే అదే విధంగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed