- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణకు తీవ్ర అన్యాయం: ఉత్తమ్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని, కేంద్రాన్ని నిలదీయాల్సిన సీఎం వారితో చేతులు కలిపి పట్టించుకోవడం లేదని, పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. లోక్సభలో ఎంపీ ఉత్తమ్ బుధవారం మాట్లాడారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగం తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విభజన చట్టంలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి చాలా హామీలు ఇచ్చారని, కానీ రాష్ట్రపతి ప్రసంగంలో వాటి ప్రస్తావన లేదన్నారు. వ్యవసాయ చట్టాలతో ఎలాంటి నష్టం లేదని కేంద్రానికి చెందిన కొంతమంది అంటున్నారని, చట్టాలు వచ్చిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రధాన మంత్రి, హోం మంత్రిని కలిశాక ఏం జరిగిందో కానీ ముందు వ్యతిరేకించి వారు తర్వాత సమర్థింపుగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ వెల్లడించారు. ఎన్నో ఏండ్లుగా నడుస్తున్న పంటల కొనుగోలు కేంద్రాలను రద్దు చేసినట్లు సీఎం ప్రకటించారని, సహకార బ్యాంకులు, మహిళ సంఘాలు నిర్వహించే కేంద్రాలను రద్దు చేయడానికి కేంద్ర వ్యవసాయ చట్టాలు కారణమని సీఎం చెప్పారన్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు లేవని, కనీస మద్దతు ధర కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నెమ్మదిగా పంటల కొనుగోళ్ల నుంచి, మద్దతు ధరల నుంచి తప్పించుకుంటుందని, 2019లో మద్దతు ధరలకు రూ. 3వేల కోట్ల బడ్జెట్ పెట్టారని, క్రమేణా దాన్ని తగ్గిస్తున్నారని, 2020లో రూ. 2 వేల కోట్లు, 2021లో రూ. 1500 కోట్లకు తగ్గించారన్నారు. అలాగే, పీఎం ఆశ పథకం కింద కూడా బడ్జెట్ బాగా తగ్గించారని, 2019లో రూ. 1500 కోట్ల బడ్జెట్ ఉండగా… 2020లో రూ. 500 కోట్లు పెట్టారని, ఈసారి రూ. 400 కోట్లకు తగ్గించారని వివరించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ భీమా యోజనతో తెలంగాణలో ఒక్క రైతుకు కూడా లబ్ధి జరగలేదని, మూడు నెలల కింద తెలంగాణలో భారీ వర్షాలకు దాదాపు 25 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే ఒక్క ఎకరాకు కూడా పరిహారం అందలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిందని, కానీ ఆ విషయంలో స్పష్టమైన నివేదిక ఇవ్వలేదని, నిజమాబాద్లో పసుపు బోర్డు పెడతామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని ఉత్తమ్ ప్రస్తావించారు.