ఉత్తమ్ సత్యగ్రహ దీక్ష : రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ వేయాలి

by Shyam |
Uttam Kumar Reddy
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ వేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకోసం సోమవారం నుంచి గాంధీభవన్‌లో సత్యా్గ్రహ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 15 రోజులు గడిచినా ఆస్పత్రుల్లో మెడిసిన్ అందుబాటులో లేదని ఉత్తమ్ మండిపడ్డారు.

తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడి విపరీతంగా పెరిగిందని, మెడికల్ బిల్లులు చెల్లించలేక రాష్ట్ర ప్రజానీకం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు తలెత్తయన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story