- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాఠీ పట్టిన టీపీవో..
దిశ, కరీంనగర్: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే భవనాలపై కొరడా ఝులిపించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారి పోలీసుల డ్యూటీ చేశారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీసులను మరిపించేలా హల్చల్ చేశారు. రోడ్లపైకి వచ్చే వాహనదారులను ఆపి కారణాలు తెలుసుకోకుండానే తాళం చెవి లాక్కుని వార్నింగ్‌లు ఇచ్చారు. దీంతో పట్టణ ప్రజలు అవాక్కాయ్యారు. అయితే, అందరికీ కరోనా జాగ్రత్తలు చెప్పిన ఆయన మాత్రం.. నిబంధనలు పాటించలేదు. మొహానికి మాస్కు, చేతులకు గ్లౌజులు లేకుండానే వాహనాలను ఆపడం పలు విమర్శలకు దారి తీసింది. ఏది ఏమైనా మోటార్ వాహనాల చట్టం ప్రకారం.. పోలీసు విభాగం లేదా ఆర్టీవో అధికారులు మాత్రమే తీసుకోవల్సిన చర్యలను టీపీవో తీసుకోవడం విమర్శలకు దారి తీసింది.
Tags: town planning officer, tpo, siricilla, police duty, lockdown, siricilla tpo, ktr, corona