- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ కరోనా @ 402
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాను కరుణ మహమ్మారి విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో నేటి ఉదయానికి మరో ఐదు క రోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదు కావడం విశేషం. దీంతో ఈ జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 82 కు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 402 మందికి కరోనా సోకింది. కర్నూలు జిల్లాలో నమోదైన కొత్త ఐదు కేసులు ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిఘీ మర్కజ్ కు వెళ్ళిన వారే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది.
ఒకవైపు కదా నా కేసులు పెరుగుతుండడం, మరోవైపు లాక్ డౌన్ గడువు ముగియనుండటంతో ఈ వైరస్ మరింతమందికి సోకుతుందని అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ లోని వివిధ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ జోన్ల పరిధిలో కఠిన ఆంక్షలు అమలు అవుతున్నాయి. మరోవైపు ఈ మహమ్మారిపై పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సొంతగా పిపిఈ కిట్లు, సర్జికల్ సూట్లు, ఎన్ 95 మాస్కులు తయారు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 82 కేసులు నమోదు కాగా ఆ తర్వాతి స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది ఈ జిల్లాలో 72 కేసులు నమోదయ్యాయి 48 కేసులతో నెల్లూరు జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ప్రకాశం జిల్లాలో 41 కృష్ణా జిల్లాలో 35 కడప జిల్లాలో 30 పశ్చిమగోదావరి జిల్లాలో 22 విశాఖపట్నం జిల్లాలో 20 తూర్పుగోదావరి జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ మహమ్మారి బారిన పడి విశాఖ జిల్లాలో నలుగురు కృష్ణా జిల్లాలో ఇద్దరు నెల్లూరు ప్రకాశం ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరు చొప్పున మొత్తం 11 మంది కోలుకున్నారు.
Tags: total corona positive cases reported in ap state, corona postive cases in ap, ap corona cases, district wise corona positive cases list