ప్యాకేజీ మొత్తం ఎంతంటే..!

by Harish |
ప్యాకేజీ మొత్తం ఎంతంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరుతో మొత్తం రూ. 20,97,053 కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడతల వారీగా ప్యాకేజీ కేటాయింపులను వెల్లడించారు. వాటికి సంబంధించి ఏ దశలో ఎంత కేటాయించారో పరిశీలిస్తే.. బుధవారం తొలి విడతలో రూ. 5,94,550 కోట్లతో ఎమ్ఎస్ఎమ్ఈ, ఈపీఎఫ్, ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రాధాన్యత ఇచ్చారు. రెండో విడత రూ. 3,10,000 కోట్లతో ఆహార ధాన్యాల పంపిణీ, ముద్ర శిశు రుణాలు, హౌసింగ్ ఫైనాన్స్ వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారు. మూడో విడతలో రూ. 1,50,000 కోట్లతో చిన్న తరహా ఆహార పరిశ్రమలు, ప్రధానమంత్రి మత్స్యసంపద, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతలతో వెల్లడించారు. చివరగా, ఆదివారం ప్రకటించిన 4,5 పార్ట్‌లలో రూ. 48,100 కోట్లను కేటాయించారు. ఇవన్నీ కలిపితే మొత్తం రూ. 11, 02,650 కోట్లుగా తేలింది. ఇంతకుముందు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా ప్రకటించిన రూ. 1,92,800 కోట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దీపనల ద్వారా రూ. 8,01,603 కోట్లను కలిపితే రూ. 9,94,403 కోట్లని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇలా మొత్తం ప్యాకేజీ విలువ రూ. 20,97,053 కోట్లని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Next Story