- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుతిలి దారాల కోసం రైతులను సతాయిస్తారా: ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి
దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్: సుతిలి దారాల కోసం కూడా రైతులను సతాయిస్తారా.. ఇదెక్కడి అన్యాయం అంటూ.. పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి అధికారులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసే విషయంలో అనేక పొరపాట్లు జరుగుతున్నాయని చివరికి గన్నీ బ్యాగులకు కుట్లు వేసేందుకు ఉపయోగించే సుతిలి దారాలను సైతం రైతులే తెచ్చుకోవాల్సి వస్తుందని సభ దృష్టికి తీసుకువచ్చారు.
దీనితో పాటు అనేక సమస్యలను ప్రస్తావించారు. ఎంపీ కల్పించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని చూస్తే మీరు ఇలా చేయడం వల్ల చెడ్డ పేరు వస్తుంది. రైతులకు న్యాయం చేసేలా వ్యవహరించాలని అధికారులకు గట్టిగా చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు సైతం ధాన్యం కొనుగోలు విషయంలో కొంతమంది ధాన్యాన్ని చేరవేసేందుకు రైతులే వాహనాలు తెచ్చుకోవాలని చెబుతున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని, సంబంధిత అధికారులు ఇటువంటి అంశాలపై దృష్టి సారించాలని లేని ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.