- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిట్ (SIT), సీబీఐ (CBI), సిట్టింగ్ జడ్జి (Sitting Judge) విచారణలకు తేడా ఇదే!
దిశ, వెబ్ డెస్క్: సిట్, సీబీఐ, సిట్టింగ్ జడ్జి, విచారణ... ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో బాగా వినిపిస్తున్న పదాలు ఇవి. ఏదైనా నేరం జరిగినప్పుడు స్థానిక దర్యాప్తు సంస్థలు, పోలీసులు విఫలమైన సందర్భంలో సిట్ గానీ, సీబీఐ గానీ లేదా సిట్టింగ్ జడ్జిచేత గానీ విచారణ జరిపిస్తారు. విచారణ ఆద్యంతం పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు ప్రభుత్వాలు, కోర్టులు ఈ రకమైన విచారణను చేపడతాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నేపథ్యంలో ఈ మూడు రకాల విచారణ పద్ధతులపై సోషల్ మీడియా వేదికగా బాగా చర్చ నడుస్తోంది. అసలు సిట్ విచారణ.. సీబీఐ విచారణ.. సింగిల్ జడ్జి విచారణ అంటే ఏంటీ? అవి ఎలా పని చేస్తాయి? వాటి మధ్య గల తేడా ఏంటీ? విషయాలు ఓ సారి చూద్దాం..
సిట్ విచారణ..
సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT). ఏదైనా పెద్ద నేరం లేక హై ప్రొఫైల్ క్రైం చోటుచేసుకున్న సందర్భంలో స్థానిక దర్యాప్తు సంస్థలు, పోలీసులు కేసు పరిష్కారంలో విఫలమైనప్పుడు సిట్ ను ఏర్పాటు చేస్తారు. సిట్ ను రాష్ట్ర ప్రభుత్వం లేక కోర్టులు ఏర్పాటు చేస్తాయి. సిట్ లో క్రైమ్ ఇన్వె్స్టిగేషన్ లో బాగా తలపండిన వ్యక్తులు, నిష్ణాతులు ఉంటారు. ఇక ఎంక్వైరీ అనంతరం సిట్ తన నివేదికను కోర్టుకు గానీ లేక రాష్ట్ర ప్రభుత్వానికి గానీ అందజేస్తుంది. సిట్ కు ఎలాంటి స్వయం ప్రతిపత్తి ఉండదు. ఇది తాత్కాలిక దర్యా్ప్తు బృందం. కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోగానే సిట్ సదరు సిట్ కార్యాకలాపాలు ఆగిపోతాయి. ఇక సిట్ ను రిటైర్జ్ జడ్జి గానీ ఐపీఎస్ అధికారి గానీ లీడ్ చేస్తారు. సిట్ సమర్పించే రిపోర్టులోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం, కోర్టులు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదు
సీబీఐ విచారణ..
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక అగ్రగామి పోలీస్ విచారణ సంస్థ. దీనిని సంక్షిప్తంగా సీబీఐ (CBI) అంటారు. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన శాశ్వత దర్యాప్తు సంస్థ. అత్యంత క్లిష్టమైన కేసుల పరిష్కారంలో సీబీఐ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలో నడిచే ఈ సంస్థకు దర్యాప్తు విషయంలో బాగా పేరుంది. దేశంలోని అవినీతి, హత్య వంటి ఎన్నో సంచలన కేసుల పరిష్కారంలో సీబీఐ ప్రముఖ పాత్ర పోషించింది. ఈ సంస్థకు ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ డైరెక్టర్ గా ఉంటారు. సంస్థ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఇక కేసులను సత్వరం పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తాయి. లేదా బాధిత వ్యక్తులు, సంస్థలు న్యాయం కోసం కోర్టుల ద్వారా సీబీఐ సేవలను పొందవచ్చు. ఇక సీబీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా కోర్టులు శిక్షను ఖరారు చేస్తాయి.
సిట్టింగ్ జడ్జిచేత విచారణ..
సిట్టింగ్ జడ్జి అంటే ప్రస్తుతం అధికారికంగా విధులు నిర్వహిస్తున్న జడ్జి అని అర్థం. సాధారణంగా ఏదైనా కేసు విచారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలపై నమ్మకం పోయినప్పుడు బాధితులు, ప్రతిపక్ష నాయకులు సిట్టింగ్ జడ్జి విచారణకు డిమాండ్ చేస్తుంటారు. కేసు తీవ్రతను బట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపడతుంటారు. విచారణ పూర్తి చేసిన అనంతరం తన నివేదికను సిట్టింగ్ జడ్జి హైకోర్టుకు గానీ సుప్రీంకోర్టుకు గానీ సమర్పిస్తారు. సిట్టింగ్ జడ్జి ఇచ్చిన నివేదిక ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తుంటాయి. స్వయంగా ఓ న్యాయమూర్తి ఎంక్వైరీకి దిగుతుంటారు కాబట్టి ఈ రకమైన విచారణలో దర్యాప్తు చాలా పారదర్శకంగా జరుగుతుంది.