- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు: కేటీఆర్
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు వల్ల ఈ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం దివిటీపల్లి గ్రామ శివారులో నిర్మించిన ఐటీ కారిడార్ ను ప్రారంభించిన అనంతరం అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ నిర్మించనున్న లిథియం ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
మొత్తం 8500 కోట్ల రూపాయలతో పది సంవత్సరాల లో అమర రాజా కంపెనీ యాజమాన్యం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందన్నారు. మొదటి సంవత్సరం 3000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి దశలవారీగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. కంపెనీ ఆరంభమైన 37 సంవత్సరాల కాలంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు జిల్లాలో పెట్టుబడులు పెట్టి కంపెనీని అభివృద్ధి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ద్వారా ఎటువంటి కాలుష్యం ఉండదు అని. అంతర్జాతీయ ప్రమాణాలతో 16 జికావాట్ల పవర్ తో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీ ద్వారా పదివేల మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు.
స్థానికులకు వృత్తి నైపుణ్యం పై శిక్షణను ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కంపెనీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఎక్సైజ్ యువజన సర్వీసులో క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 2014 ముందు ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోక.. వలసల జిల్లాగా ఉండేది.. 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేది. అటువంటిది ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చేలా పాలమూరు అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడ పరిశ్రమల స్థాపన కోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇప్పటికే పలు ఐటి కంపెనీలు వచ్చాయి. అమర రాజా కంపెనీ ఏర్పాటుతో వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
స్థానికులకే ఉద్యోగ అవకాశాలు..
స్థానికులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అమర రాజా కంపెనీ అధినేతలు డాక్టర్ రామచంద్ర నాయుడు, గల్లా అరుణ, గల్లా జయదేవ్ వెల్లడించారు. ప్రపంచంలో పలుచోట్ల స్థాపించిన తమ కంపెనీల అన్నింటికన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఇక్కడ స్థాపించినట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రత్యేకతలను మంత్రులకు వివరించారు.
ఉద్యమ సమయం నాటి సంఘటనలు జ్ఞాపకం చేసుకున్న మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి అరుణ..
తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన పలు సంఘటనలను ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి గల్లా అరుణ సమావేశంలో ప్రస్తావించారు.. తెలంగాణ అవసరమా అని నేను అంటే.. అవసరమే .. సిస్ అని కేటీఆర్, హరీష్ రావు ఆటపట్టించేవారు. రాష్ట్రం విడిపోయే సందర్భంలో చాలా బాధ వేసింది. ఆ సందర్భంలో హరీష్, కేటీఆర్ సిస్ మనం రాష్ట్రాలవారీగా విడిపోయిన.. తెలుగు ప్రజలుగా అందరం కలిసి ఉంటాం.. ఎప్పటికీ నీవు మా ఆడపడుచువే.. అని హామీ ఇచ్చారు.. ఇచ్చిన మాట ప్రకారమో... యాదృచ్ఛికమో కానీ మళ్లీ నా సోదరుల సహకారంతో ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని అరుణ చెప్పుకొచ్చారు. ఆ రోజులలో తనతో పాటు ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్న సన్న సుధాకర్ రెడ్డి కూడా శాసనసభ సభ్యురాలుగా ఉన్నారన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
మంత్రి కేటీఆర్ అక్క అరుణ ఆరోజు రాష్ట్రాలుగా విడిపోతేనే మనం అన్ని విధాల అభివృద్ధి చెందుతాం.. అని చెప్పాము. ఆ విషయం ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తోంది కదా అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ లు స్వర్ణ సుధాకర్ రెడ్డి, సరిత, ఎమ్మెల్యేలు డాక్టర్ శ్రీ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జైపాల్ యాదవ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరేటి వెంకన్న, దామోదర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్, జిల్లా కలెక్టర్ రవి నాయక్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి : దేశంలో బీఆర్ఎస్ కు తిరుగులేదు: మంత్రి మల్లారెడ్డి