ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర.. కిలో రూ.30 ఎక్కడంటే.?

by Anukaran |   ( Updated:2021-11-26 23:33:01.0  )
ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర.. కిలో రూ.30 ఎక్కడంటే.?
X

దిశ, వెబ్‌డెస్క్ : కొద్ది రోజులుగా టమాటా ధర సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నది. పెట్రోల్, డిజిల్ ధరతో పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే సెంచరీ మార్క్‌ను దాటేసింది. ఇదిలా ఉండగా రాత్రికి రాత్రే టమాటా ధర దిగివచ్చింది. అది ఎక్కడ అనుకుంటున్నారా.. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో కిలో 100 రూపాయలు పలికిన టమాటా ధర.. రూ. 30కి పడిపోయింది. ఒక్కసారిగా ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే వ్యాపారులు మాత్రం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి టమాటాలు దిగుమతి అవుతుండడంతోనే ధర తగ్గినట్టు చెబుతుండటం విశేషం. కాగా, టమాటా ధరలను అదుపు చేసేందుకు ఏపీ సర్కార్ రంగంలోకి దిగింది. రైతుల నుంచి నేరుగా టమాటాలను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతపురంలో రైతుల నుంచి రూ. 50 చొప్పున కొనుగోలు చేసి మార్కెట్లో రూ. 55 చొప్పున విక్రయిస్తుండగా.. కృష్ణా జిల్లాలో కిలో టమాటా ధర రూ. 60గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed