లక్కీ చాన్సులే.. ఇక్కడ టమాట ఎంతో తెలుసా..?

by Anukaran |
లక్కీ చాన్సులే.. ఇక్కడ టమాట ఎంతో తెలుసా..?
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: కొన్ని రోజులుగా ఆకాశాన్నంటిన టమాట ధర‌ ఎట్టకేలకు తగ్గుముఖం పడుతోంది. నగరంలో ఆదివారం కిలో టమాటా ధర రూ. 34 కు చేరింది. పది రోజుల క్రితం రూ.100 కు 5 కిలోల టమాట లభించగా, ధర రోజు రోజుకూ పెరుగుతూ పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాల కారణంగా టమాట సరఫరా దెబ్బతినడం ఇందుకు ప్రధాన కారణమ‌ని అధికారులు అంటున్నారు.

నగర పరిధిలోని సరూర్‌నగర్‌, బోయిన్‌ప‌ల్లి మార్కెట్లకు తక్కువ మొత్తంలో సరుకు రావడంతో వ్యాపారులు ధరలు పెంచి కొనుగోలుదారులను అడ్డంగా దోచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ధరలు తగ్గడంతో ప్రజలకు ఊరట లభించింది. మరో రెండు రోజుల్లో కిలో రూ.20 నుంచి రూ.25కే లభించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story