- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాతకు వంద.. వెల్లువెత్తిన చందా!
దిశ వెబ్ డెస్క్:
ఆయన వయస్సు 99. మరో మూడు వారాల్లో ఆయన పుట్టినరోజు. అంటే ఆయన జీవితంలో సెంచరీ మజిలీకి చేరువయ్యాడన్నమాట. ఆ అద్భుతమైన ఘట్టాన్ని.. మధురమైన రోజుగా మలుచుకుందామనుకున్నాడు. అందుకోసం ఆ కురువృద్ధుడు తనకు తానే సవాల్ విసురుకున్నాడు. తన ఇంటి గార్డెన్ విస్తీర్ణం ఎంత ఉందో దాని కన్నా వంద రెట్లు ఎక్కువ దూరం నడిచి 1,000 పౌండ్లు అంటే (సుమారు రూ.96,000 ) మాత్రమే సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఏముంది అంటారా.. ఆ పందెం ఆయన కోసం కాదు…. కరోనా బాధితుల కోసం. 1000 పౌండ్ల విరాళాలు సేకరించాలనే లక్ష్యంతో ఏప్రిల్ 8న ఆ పెద్దాయన ‘జస్ట్ గివింగ్ ఫండ్ రైజర్’ పేరుతో చాలెంజ్ చేపట్టాడు. అనూహ్యంగా ఆ తాత చేస్తున్న పనికి విరాళాలు పోటెత్తాయి. కేవలం వారం రోజుల్లోనే ఏకంగా 19 మిలియన్ పౌండ్ల విరాళాలు వచ్చాయి. వాటిని యూకేకు చెందిన ‘నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ ఎస్)’ అందించాడు. ఇంతకీ ఆయనెవరంటే.. లండన్ కు చెందిన ఆర్మీ మాజీ కెప్టెన్ టామ్ మూర్. అసలే ఓ ఎముక విరిగింది. మరో మూడు వారాలైతే ఆయన వయస్సు 100 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ వయసులో ఎవరైనా.. చాలెంజ్ లు విసురుతారా? కానీ, కరోనాపై పోరాటం కోసం నిధులు సేకరించడానికి వయసు అడ్డంకి కాదని, పట్టుదల, ఆత్మవిశ్వాసముంటే ఏదైనా సాధ్యమని అంటున్నాడు టామ్ మూర్. ఏప్రిల్ 8న మొదలు పెట్టిన చాలెంజ్ ను ఏప్రిల్ 16 గురువారం ముగించాడు. మొత్తంగా 100 సార్లు తన ఇంటి చుట్టూ తిరిగి ఔరా అనిపించాడు. . మూర్ ప్రయత్నానికి ముగ్ధులైన నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఆయనకు విరాళాలు అందచేశారు. సుమారు 19 మిలియన్ పౌండ్లు కలెక్ట్ చేశారు. అంటే సుమారు రూ. 181 కోట్లు (1,81,82,55,825.00) సేకరించారు. కరోనా బాధితుల సహాయార్థం ఖర్చుచేయాలని ఎన్ హెచ్ ఎస్ సంస్థకు ఆ డబ్బును అందించారు.
“వన్ మాన్ ఫండ్ రైజింగ్ మెషిన్”
ఈ పనికి గానూ మూర్ ను “వన్ మాన్ ఫండ్ రైజింగ్ మెషిన్” గా డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్ ప్రశంసించింది. ఆయన్ను వీరుడిగా సత్కరించాలని ఐదు లక్షల మందికి పైగా ప్రజలు ఆనర్స్ కమిటీకి విజ్ఞప్తి చేశారు.
సర్వత్రా ప్రశంసలు వెస్ట్ యార్క్‌షైర్‌లోని కెగ్లీలో జన్మించాడు. మూర్ సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ ఆర్మీలో పని చేశారు. ఆ యుద్ధ సమయంలో ఇండియా, ఇండోనేషియా, బ్రిటన్ లలో ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన బెడ్ ఫోర్డ్ షైర్ లో నివసిస్తున్నాడు. తన చాలెంజ్ తో .. టామ్ మూర్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రముఖుడైపోయాడు. టామ్ మూర్ సేవలను గుర్తించి, గౌరవిస్తామని కెగ్లీ టౌన్ కౌన్సిల్ ట్వీట్ చేసింది. క్రీడాకారులు, సెలబ్రిటీలు ఆయనను అభినందిస్తూ సందేశాలు పంపారు. నేషనల్ హెల్త్ సర్వీస్‌కి టామ్ మూర్ చేసిన సహాయం స్ఫూర్తిదాయకమని ఇంగ్లండ్ ఫుట్ బాల్ టీం కెప్టెన్ హ్యారీ కేన్ ట్వీట్ చేశారు. బ్రిటీష్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ కూడా మూర్ చేసిన పనిని గుర్తించారు.
‘ఇంత ఎక్కువ మొత్తంలో విరాళాలు వస్తాయని ఊహించలేదు. ఎంతో దయతో వ్యవహరించి విరాళాలు అందించారు, మీ అందరికీ నా కృతజ్ఞతలు ’అని మూర్ పేర్కొన్నారు. ఇంతకీ ఆయన పుట్టిన రోజు ఎప్పుడో చెప్పలేదు కదూ.. ఏప్రిల్ 30. అంటే ఇంకో పన్నెండు రోజులన్నమాట.
Tags: corona virus, tom moore, british war veteran , britain, england, giving me fundraiser