టాలీవుడ్ ‘టామ్ బాయ్స్’

by Shyam |
టాలీవుడ్ ‘టామ్ బాయ్స్’
X

దిశ, వెబ్‌డెస్క్ : టామ్ బాయ్ అంటే.. అమ్మాయి అయినప్పటికీ అబ్బాయిలా బిహేవ్ చేయడం. అబ్బాయిలు చేసే యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ చూపించడం, అబ్బాయిలాగే డ్రెస్ అప్ కావడం, సిగ్గుపడే ప్రస్తావనే లేకపోవడం. ధైర్యంగా మాట్లాడటం.. తిట్టాల్సి వస్తే నిర్భయంగా, మనస్ఫూర్తిగా, మొహమాటం లేకుండా అబ్బాయిల కంటే బాగా బూతులు తిట్టేయడం. డ్రామా క్వీన్స్‌లా కాకుండా ప్రాక్టికల్‌గా ఉండటం. ఫ్యామిలీ రెస్పాన్స్ తీసుకోవడం, అమ్మానాన్నను ఎలా చూసుకోవాలి? ఏ బిజినెస్ చేయాలని ఆలోచించడం. సొసైటీ గురించి పట్టించుకోకుండా మగాళ్లతో సమానంగా సక్సెస్ కావాలని ట్రై చేయడం, మగాళ్లతో ఫ్రెండ్‌షిప్ చేయడం. ‘యాక్ట్ లైక్ మెన్.. థింక్ లైక్ మెన్.. నిజం చెప్పాలి అంటే టామ్ బాయ్ వల్లే ప్రపంచం మారుతుంది’ అనేది డైరెక్టర్ పూరి జగన్నాధ్ లేటెస్ట్ పొడ్‌కాస్ట్. మరి అలాంటి టామ్ బాయ్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరున్నారు? అంటూ టామ్ బాయ్ ట్రెండ్‌కు తెరలేపింది టాలీవుడ్ వన్ ఆఫ్ టామ్ బాయ్ చార్మి కౌర్. ఈ చాలెంజ్‌లో తాము కలిసిన టామ్ బాయ్ పేర్లను చెప్పాల్సి ఉంటుంది.

https://twitter.com/Charmmeofficial/status/1331562958678224897?s=19

ఈ క్రమంలో ఇండస్ట్రీలో తను కలిసిన టామ్ బాయ్స్‌లో రమ్య కృష్ణ, త్రిష, సమంత, నభా నటేష్, లక్ష్మీ మంచు, నందిని రెడ్డి, ఆదా శర్మ పేర్లను తెలపగా.. ఈ చాలెంజ్ స్వీకరించిన రమ్య కృష్ణ.. రాధికా శరత్ కుమార్, మధు బాలను నామినేట్ చేశారు. ఇక మంచు లక్ష్మీ ప్రసన్న.. రకుల్ ప్రీత్, తాప్సీ, సునీతా కృష్ణన్‌ను నామినేట్ చేశారు. నందిని రెడ్డి.. సమంత, స్వప్న దత్‌తో పాటు ఇషా కొప్పికర్‌ను నామినేట్ చేసింది. ఇండస్ట్రీలో ఇంకా టామ్ బాయ్ చైన్ కొనసాగుతుండగా.. ఈ పొడ్‌కాస్ట్‌పై సామాన్యుల నుంచి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

https://twitter.com/nandureddy4u/status/1331640470577967104?s=19

Advertisement

Next Story